MLA Basavagouda: నేనే నిజమైన ప్రతిపక్షనేతను.. అడ్జ్స్ట్మెంట్ రాజకీయ నేతను కాను..
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:29 PM
విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనే నిజమైన ప్రతిపక్షనేతను.. అడ్జ్స్ట్మెంట్ రాజకీయ నేతను కాను.. అంటూ ఆయన చేసిన కామెంట్స్.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.
బెంగళూరు: ‘నేనే నిజమైన ప్రతిపక్ష నేతనని’ అడ్జ్స్ట్మెంట్ రాజకీయ నేతను కానని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్(MLA Basanagouda patil Yatnal) మండిపడ్డారు. మంగళవారం బెళగావి శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల వేళ రాష్ట్రంలో సాగునీటి పథకాలకు సంబంధించి భూస్వాధీన ప్రక్రియపై ఆయన ప్రసంగించారు. కృష్ణా ఎగువ ప్రాజెక్టు నిర్మాణాలు జరిగి ఆరు దశాబ్దాలు పూర్తయినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ప్రధానంగా కృష్ణా నదికి అనుబంధంగా మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి పాలనలో ప్రారంభమైందని ఇప్పటికి ఆరు దశాబ్దాలు ముగిసినా ఇంకా మూడోవిడత పనులు చేపట్టలేదన్నారు.
ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరకర్ణాటకకు శాశ్వతంగా సాగు, తాగునీరు సాధ్యం కానుందన్నారు. ముంపు పరిహారం, పునరావాసం, కాలువల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. వీటికి రూ.70వేల కోట్ల మేర పరిహారం ఖర్చు కానుండగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు మరో రూ.50వేల కోట్లు అవసరమన్నారు. ఇలా కృష్ణా ఎగువ ప్రాజెక్టుకు కనీసంగా రూ.1.20లక్షల కోట్లు అవసరం కానుందన్నారు. ఎన్నేళ్ళకు గ్రాంట్లు మంజూరు సాఽధ్యం కానుందన్నారు. 2023లోనే పరిహారానికి సంబంధించి కోర్టు అవార్డుకు అనుబంధంగా ఇవ్వాలన్నారు. పరిహారం విషయంలో కోర్టు సూచించిన మేరకు ఇవ్వాలని పట్టుబట్టారు.

ఇదే విషయమై జలవనరుల శాఖా మంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) అభ్యంతరం తెలిపారు. దీనిపై యత్నాళ్ మాట్లాడుతూ కోర్టు సూచించిన విధంగా పరిహారం ఇవ్వలేమని చెప్పడం సరికాదన్నారు. ఇదే విషయమై గతంలో కృష్ణా నదికి అనుబంధంగా ఉండే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అభ్యంతరం తెలిపాయన్నారు. ప్రాజెక్టు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం పరిహారం విషయంలో కోర్టు తీర్పును పాటించలేమని చెప్పడం సమంజసం కాదని సభనుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువత బలి...
సమాజంలో ఆన్‌లైన్ గేమ్‌లకు యువత బలవుతున్నారని ఇటీవల హాసన్ జిల్లాలో పలు కేసులు నమోదైన విషయాన్ని సకలేశపుర ఎమ్మెల్యే సిమెంట్ మంజు సభలో ప్రస్తావించారు. ఆన్‌లైన్ గేమ్‌లు, సైబర్ నేరాలను నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయమై హోంమంత్రి పరమేశ్వర్ వివరణ ఇస్తూ 2023లో 22,255 సైబర్ నేరాలు నమోదు కాగా 2024వ ఏడాది 22,478 కేసులు, 2025లో ఇంతవరకు 13000ల కేసులు నమోదైనట్లు తెలిపారు. గడిచిన మూడేళ్ళతో పోల్చితే కేసులు తగ్గినట్లే అన్నారు. కాగా మూడేళ్ళలో 10,717 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఇదే సందర్భంలోనే బీజేపీ సభ్యుడు సునిల్‌కుమార్ జోక్యం చేసుకుని వచ్చేనెలలో ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపైనా అన్నివర్గాలు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని ముందుగా ఎవరనేది నిర్ధారిస్తే బాగుంటుందన్నారు. దీంతో స్పీకర్ ఇటువంటి వ్యాఖ్యలు సరికాదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News