Parrot : పెంపుడు చిలుకను కాపాడబోయి.. అనంతలోకాలకు..
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:47 AM
పెంపుడు చిలుకను రక్షించబోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాద సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు వెచ్చించి విదేశీ పెంపుడు చిలుకను కొనుగోలు చేశాడు. అయితే.. ఇంటిముందున్న కరెంట్ స్తంభంపై వాలగా దాన్ని రక్షించే ప్రయత్నంలో విద్యుత్ షాక్ కు గురై మృతిచెందాడు.
- విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
బెంగళూరు: హైటెన్షన్ విద్యుత్‌లైన్ ఉండే స్తంభంపై 2 లక్షల రూపాయల విలువైన విదేశీ పెంపుడు చిలుకను రక్షించే ప్రయత్నంలో కరెంటు షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరు నగరం గిరినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు అనుబంధంగా ఉండే ప్రదేశంలో హైటెన్షన్ వైరు ఉంది. ఇంట్లో ఉండే చిలుక హైటెన్షన్ కరెంటు స్తంభంపై వాలింది.

రక్షించాలని అరుణ్‌కుమార్ (32) ప్రయత్నించారు. ఓ ఐరన్ పైప్‌కు ముందుభాగంలో కర్రను అమర్చుకున్నాడు. కాంపౌండ్ గోడపైకి వెళ్లి చిలుకను తోలే ప్రయత్నం చేశాడు. కానీ ఐరన్ పైప్ పైకి ఎత్తగానే 66కేవీ విద్యుత్‌వైర్‌లు కావడంతో ఒక్కసారిగా షాక్ తగిలింది. కాంపౌండ్ గోడపైనుంచి అరుణ్ కిందపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే అరుణ్‌కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్
Read Latest Telangana News and National News