Exams: కళ్లకు గంతలతో 8వ తరగతి పరీక్ష..
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:14 PM
కళ్లకు గంతలు కట్టుకుని ఓ విద్యార్థిని పరీక్ష రాస్తూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. హిమబిందు అనే బాలిక 8వ తరగతి పరీక్షలు రాస్తోంది. అయితే.. గాంధారి విద్య సహాయంతో కళ్లకు గంతలు కట్టుకుని తన 8వ తరగతి పరీక్షలు రాస్తోంది.
- గాంధారి విద్యలో బాలిక ప్రావీణ్యం
బళ్లారి(బెంగళూరు): జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న హిమబిందు (14) గాంధారి విద్య సహాయంతో కళ్లకు గంతలు కట్టుకుని తన 8వ తరగతి పరీక్షలు రాస్తోంది. నగర శివారులోని కొర్లగుంది నివాసి హిమబిందు(Himabindu) 11సంవత్సరాల వయసులో గాంధారి విద్య నేర్చుకుంది. ఇప్పుడు దాని రెండవ స్థాయి చదువుతోంది. గతంలో కూడా బిందు కళ్లుమూసుకుని సైకిల్ తొక్కిందని అమె తండ్రి రామాంజినిరెడ్డి(Ramanjini Reddy) తెలిపారు.

గాంధారి విద్య మొదటి దశలోఒక వ్యక్తి కళ్లుమూసుకుని తన ముందు ఉన్న వస్తువులను గుర్తించడం నేర్చుకునేదని, రెండవ దశలో ఆమె తన వెనుక జరుగుతున్న విషయాలను గ్రహించేది. చిక్కమగళూరుకు చెందిన సతీశ్ పద్మనాభ నుంచి 20రోజుల వ్యవధిలో ఆన్‌లైన్‌లో నేర్చుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్
Read Latest Telangana News and National News