Minister Madhu Bangarappa: మా రక్తంలో కన్నడ ఉంది.. ఆ పాఠశాలలను మూసే ప్రసక్తే లేదు
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:11 PM
మా రక్తంలో కన్నడ ఉంది.. ఆ పాఠశాలలను మూసే ప్రసక్తే లేదు.. అన్నారు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధుబంగారప్ప. అలాగే.. 500 పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించామని, అందుకు అనుగుణంగానే 309 పాఠశాలలు ప్రగతి దశలో ఉన్నాయన్నారు.
- మంత్రి మధుబంగారప్ప
బెంగళూరు: ‘మా రక్తంలో కన్నడ ఉంది.. అదే మా శ్వాస అని ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నడ పాఠశాలలను మూసే ప్రసక్తే లేదు’ అని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధుబంగారప్ప(Minister Madhu Bangarappa) అన్నారు. పరిషత్ ప్రశ్నోత్తరాల వేళ చిదానందగౌడ ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో 900 ప్రభుత్వ పాఠశాలలను కర్ణాటక పబ్లిక్ స్కూల్స్‌ను ఉన్నతీకరిస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని గ్రామపంచాయతీల్లోనూ కర్ణాటక పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభిస్తామన్నారు. కన్నడ పాఠశాలలను మూసేసే ప్రసక్తే లేదన్నారు. బడ్జెట్‌లో 500 పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించామని, అందుకు అనుగుణంగానే 309 పాఠశాలలు ప్రగతి దశలో ఉన్నాయన్నారు.

2.72 లక్షలమంది పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారన్నారు. ఉపాధ్యాయులు లేని కారణంగా గెస్ట్ రూపంలో నియమించుకున్నామన్నారు. ప్రతి పబ్లిక్‌స్కూల్‌లో 1200 మంది విద్యార్థులకు అవసరమైన సౌలభ్యాలు ఉండేలా నిర్మిస్తామన్నారు. సభ్యులు జగదేవ్ గుత్తేదార్, కేశవ్‌ప్రసాద్‌లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు బూట్లు, సాక్సుల కోసం రూ.111.88 కోట్లు విడుదల చేశామన్నారు. 44,525 పాఠశాలలకు గ్రాంట్లు విడుదల అయ్యాయన్నారు.
కృష్ణజింకల మృతికి వైరస్ కారణం: మంత్రి ఖండ్రె
బెళగావి భూతరామనహట్టిలోని కిత్తూరు రాణి చన్నమ్మ జూలో 40 కృష్ణ జింకల మృతికి వైరస్ సోకడమే కారణమని అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రె వెల్లడించారు. పరిషత్‌లో సభ్యుడు తలవారసాబణ్ణ ప్రశ్నకు సమాధానంగా కృష్ణ జింకలు ‘హెమరాజిక్ సెప్టెసేమియా’ అనే వైర్‌సకు గురైనట్లు ధ్రువీకరణ అయ్యిందన్నారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు
ఆపరేషన్ వేళ బెళగావి డాక్టర్ల నిర్లక్ష్యం లేదని వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాశ్‌పాటిల్ అన్నా రు. పరిషత్‌లో నాగరాజు యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరణ ఇచ్చారు. బీమ్స్ సంస్థలో ఆపరేషన్‌ల వేళ డాక్టర్ల ద్వారా ఏ నిర్లక్ష్యం జరగలేదన్నారు. ఓ రోగి కడుపులో గడ్డకు బదులు పేగులు తొలగించారనే ప్రచారంపై మాట్లాడుతూ రోగి దీర్ఘకాలంగా మద్యానికి బానిస అని, పొగాకు వాడేవారన్నారు. ఆసుపత్రికి వచ్చేసరికే అతను తీవ్రమైన సమస్యతో ఉన్నాడన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News