Share News

Bengaluru News: అమ్మా నన్ను క్షమించు... ప్రేమ పేరుతో మోసపోయాను

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:57 PM

అమ్మా నన్ను క్షమించు.. ప్రేమ పేరుతో మోసపోయాను.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా... అంటూ ఓ యువతి తల్లికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ విషయానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Bengaluru News: అమ్మా నన్ను క్షమించు... ప్రేమ పేరుతో మోసపోయాను

- లేఖరాసి యువతి ఆత్మహత్య

బెంగళూరు: అమ్మా నన్ను క్షమించు, ఇష్టం లేకున్నా తప్పు చేశా.. ఈ శరీరం మట్టిలో కలసిపోవాల్సిందే అంటూ డెత్‌నోట్‌ రాసి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. ప్రేమ పేరిట కుట్రలో ఇరుక్కుపోయానని, తన ప్రైవేట్‌ ఫొటోలు చూపి బెదిరించి లైంగికంగా వాడుకుని వంచించారని ఆ బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డెత్‌నోట్‌లో పేర్కొంది. బెంగళూరు దక్షిణ జిల్లాకు చెందిన ఓ యువతి (22) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.


zzzzzz.jpg

మైసూరు(Mydoor) లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఎంఎస్సీ చదువుతోంది. తుమకూరు(Tumakuru) జిల్లా కుణిగల్‌కు చెందిన అభి (28) అనే యువకుడు బ్లాక్‌మెయిల్‌ చేసి మోసం చేశాడని డెత్‌నోట్‌లో పేర్కొంది. ప్రైవేట్‌ ఫొటోలతో బెదిరించి లైంగికంగా సహకరించాలని ఒత్తిడి చేశాడని, ఫొటోలను డిలీట్‌ చేస్తాననడంతో ఇష్టం లేకున్నా తప్పు చేశానని వాపోయింది. ఫలితంగా గర్భం దాల్చాక అతనే గర్భస్రావం చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బతుకుపై ఆశ లేదని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. అమ్మా సాధ్యమైతే క్షమించాలని రాసుకుందని పోలీసులు తెలిపారు. రామనగర రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2025 | 01:57 PM