Home » Karnataka
ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వందలాది మృతదేహాలను పాతిపెట్టినట్టు ఫిర్యాదు చేసిన మాజీ పౌర కార్మికుడు సిట్ ఎదుట...ఫిర్యాదు వెనుక కొందరి ప్రోత్సాహం ఉందని...
Ghost Appears: టీచర్ హోం వర్క్ గురించి అడగ్గానే పిల్లాడు దెయ్యం డ్రామా మొదలెట్టాడు. దెయ్యం పట్టినట్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటం మొదలెట్టాడు. దీంతో అక్కడి టీచర్లు ఆశ్చర్యపోయారు.
Love Triangle: తన మాజీ ప్రియురాలు వేరే వాడితో తిరగటం తట్టుకోలేకపోయాడు. ఆమె కొత్త ప్రియుడు చందన్‌పై పగ పెంచుకున్నాడు. చందన్‌ను చంపడానికి కుట్ర పన్నాడు. మాట్లాడాలని చెప్పి చందన్‌ను ఓ చోటుకు రప్పించాడు.
ధర్మస్థలలో సాగుతున్న వివాదం వెనుక కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని.., హిందూ మతం, ఆలయాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు కమ్యూనిస్టు భావాలు కలిగిన అర్బన్ నక్సల్స్‌కు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ప్రతిపక్షనేత అశోక తీవ్రంగా ఆరోపించారు.
ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలైన వ్యక్తి కేవలం 200 రూపాయల కూలి డబ్బులకోసం తోటి కూలీని దారుణంగా హతమార్చిన సంఘటన ఉత్తరకన్నడ జిల్లా శిరసి తాలూకాలో చోటు చేసుకుంది. కమటగేరిలో గురువారం రాత్రి 8.30 గంటలకు కమటగేరి వాజిరాజమఠం సమీపంలో రవీశ్ గణపతి చన్నయ్య, మంజునాథ బసయ్య చన్నయ్యల మధ్య గొడవ జరిగింది.
విద్యార్థి దశలో లా కోర్సు చేయాలని భావించానని కానీ చదువుకునేటప్పుడే పార్టీ టిక్కెట్ ఇచ్చిందని తన ఆశయం నెరవేర్చుకునేందుకు నా కుమారుడిని అడ్వకేట్ చేస్తున్నానని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు.
ధర్మస్థల సామూహిక ఖననం కేసులో ప్రధాన సాక్షి తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ ప్రాంతంలో 80 మృతదేహాలను తన చేతులతోనే పాతిపెట్టానని చెప్పడంతోపాటు.. ఎలా ఖననం చేశాడో వివరించాడు.
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ నటుడు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా 7 మంది నిందితుల బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో పోలీసులు మరోసారి పవిత్ర గౌడను అరెస్టు చేశారు.
ధర్మస్థలలో 13వ పాయింట్‌లో జీపీఆర్ టెక్నాలజీ స్కానింగ్ చేసిన ప్రదేశంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రక్రియ కొనసాగింది. ఓవైపు వర్షం కురుస్తున్నా తవ్విన ప్రాంతంలో నీరు వస్తుండడంతో మోటార్లతో తొలగించి ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
ధర్మస్థళ పవిత్రతకు భంగం కలిగించేలా కుట్ర సాగుతోందని 17వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేలంతా ధర్మస్థళను సందర్శిస్తామని పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ మేం బీజేపీ కార్యకర్తలుగా వెళ్లడం లేదని, మంజనాథేశ్వర భక్తులుగా ధర్మస్థళకు వెళ్తున్నామన్నారు.