Share News

Crocodile: నీటి గుంతలో మరోసారి ప్రత్యక్షమైన మొసళ్లు

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:50 PM

నగర సమీపం యక్లాస్‏పూర్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీ నీటి గుంతలో రెండు మొసళ్లు మరో సారి ప్రత్యక్షం కావడం స్థానికల్లో కలకలం రేపింది. యక్లాస్‏పూర్‌ గ్రామ శివారుకు వెళ్లే ఎన్‌ఆర్‌బీసీ కాలువ నీరు సర్వే నంబరు 347 పొలంలో భారీ గుంతలోకి వచ్చి చేరుతుండడంతో మొసళ్లు వచ్చి చేరాయి.

Crocodile: నీటి గుంతలో మరోసారి ప్రత్యక్షమైన మొసళ్లు

రాయచూరు(బెంగళూరు): నగర సమీపం యక్లాస్‏పూర్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీ నీటి గుంతలో రెండు మొసళ్లు(Crocodiles) మరో సారి ప్రత్యక్షం కావడం స్థానికల్లో కలకలం రేపింది. యక్లాస్‏పూర్‌ గ్రామ శివారుకు వెళ్లే ఎన్‌ఆర్‌బీసీ కాలువ నీరు సర్వే నంబరు 347 పొలంలో భారీ గుంతలోకి వచ్చి చేరుతుండడంతో మొసళ్లు వచ్చి చేరాయి. ఆ నీటిలో ఇప్పటికే రెండు మొసళ్లు ఉన్నట్లు గ్రామస్థులు తెలపగా గత ఆదివారం వాటిని బంధించేందుకు ప్రయత్నించిన అటవీ అధికారులు అవి చిక్కకపోవడంతో వెనుదిరుగారు.


pandu2.jpg

గురువారం మరోసారి రెండు మొసళ్లు కనిపించినట్లు గ్రామస్థులు చెప్పడంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ నీటి గుంతలో పశువులు, మేకలు, గొర్రెలు నీరు తాగేందుకు వెళుతున్నాయని, కొంతమంది రైతులు ఆ నీటిని వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరగకముందే అటవీ శాఖ అధికారులు మేల్కొని మొసళ్లను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2025 | 03:50 PM