Karnataka- Menstrual Leave: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక కేబినెట్ ఆమోదం
ABN , Publish Date - Oct 09 , 2025 | 07:35 PM
కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు నెలకు వేతనంతో కూడిన ఒక రోజు సెలవు మంజూరు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా వేతనంతో కూడిన ఒక సెలవు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగుల, వస్త్ర పరిశ్రమ, బహుళజాతి కంపెనీలు, ఐటీ సంస్థలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రైవేటు రంగ సంస్థలన్నీ మహిళా ఉద్యోగులకు ప్రతి నెల వేతనంతో కూడిన ఒక నెలసరి సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది (Karnataka - Paid Mentrual Leave).
మహిళా సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మహిళలకు అండగా ఉండి ప్రోత్సహించే పని వాతావరణం కల్పించడమే తమ ఉద్దేశమని పేర్కొంది. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఈ చర్య ఎందరో మహిళలకు లాభం చేకూరుస్తుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ అన్నారు (Karnataka Cabinet Nod).
ఇప్పటికే బిహార్, ఒడిశా, కేరళ, సిక్కిమ్ రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఇక ప్రభుత్వ పాలసీలతో నిమిత్తం లేకుండా కొన్ని ప్రైవేటు సంస్థలు ఇప్పటికే వేతనంతో కూడిన నెలసరి సెలవులు ఇస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, ఎల్ అండ్ టీ వంటి సంస్థల్లో నెలసరి సెలవుల వెసులుబాటు ఉంది. అయితే, అసంఘటిత రంగంలో ఇలాంటి సంస్కరణలు అమలు చేయడం ఇంకా సవాలుగానే ఉందని మహిళా హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
భారత్ టార్గెట్‌గా మహిళా ఉగ్రవాదుల బృందం.. పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కొత్త వ్యూహం
ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య.. డీజీపీ విషయంలో హర్యానా కీలక నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి