Puran Kumar Suicide: ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య.. డీజీపీ విషయంలో హర్యానా కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:38 PM
ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్య ఉదంతం ప్రస్తుతం హర్యానాను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీని సెలవులపై పంపించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఉదంతం ప్రస్తుతం హర్యానాలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను సెలవులపై పంపించి ఆయన స్థానంలో తాత్కాలికంగా మరొకరికి ఎంపిక చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంపై తగు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం (DGP Shatrujeet Kapur leave).
వై.పూరన్ కుమార్ వద్ద సూసైడ్ నోట్ లభించిన విషయం తెలిసిందే. ఈ నోట్‌లో ఆయన పలు సీనియర్ అధికారులపై ఆరోపణలు చేశారు. దాదాపు 12 మంది పేర్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందులో ఓ డీజీపీ ర్యాంకు అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు, ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లను పూరన్ కుమార్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. కుల వివక్ష, పాలనపరమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇక తన ఆస్తి మొత్తం భార్యకు చెందాలని కూడా విల్లు రాశారు. ఈ కేసుకు సంబంధించి ఇవన్నీ కీలక ఆధారాలుగా భావిస్తున్నారు. ఇప్పటికే పారెన్సిక్ అధికారులు ఆయన ఇంట్లో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఇక పూరన్ కుమార్ భార్య తన ఫిర్యాదులో పేర్కొన్న రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది (Haryana IPS officer suicide).
పూరన్ కుమార్ ఆత్మహత్య ఉదంతం ప్రస్తుతం పోలీసు, ఐపీఎస్ సర్కిల్స్‌లో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రెటరీ సహా సీనియర్ అధికారులకు పూరన్ కుమార్ గతంలో అనేక ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. కుల వివక్ష, ప్రమోషన్లలో అవకతవకలు, శాఖాపరమైన వేధింపులు తదితర విషయాలపై కంప్లెయింట్ చేసినట్టు సమాచారం.
ఇక డీజీపీ ఎంపికకు ఇద్దరు సీనియర్ అధికార్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఓపీ సింగ్, 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అలోక్ మిత్తల్ ముందు వరుసలో ఉన్నారు. ఓపీ సింగ్ ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డీజీగా ఉన్నారు. అలోక్ మిత్తల్ రాష్ట్ర విజిలెన్స్, యాంటీ కరప్షన్ బ్యూరోకు నేతృత్వం వహిస్తున్నారు. ఇద్దరికీ సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉంది.
ఇవి కూడా చదవండి:
భారత్ టార్గెట్‌గా మహిళా ఉగ్రవాదుల బృందం.. పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కొత్త వ్యూహం
కన్ఫర్మ్‌డ్ టిక్కెట్లల్లో ప్రయాణ తేదీ మార్పుకు ఛాన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి