Share News

Husband Kills wife: పెళ్ళైన నాలుగు నెలలకే భార్యని చంపిన భర్త.. కారణం తెలిస్తే షాకే!

ABN , Publish Date - Oct 09 , 2025 | 02:00 PM

ఎంతో అభివృద్ధి చెందిన నేటికాలంలో కూడా మహిళలు, యువతులపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా లైంగిక , వరకట్న వేధింపులకు ఆడవాళ్లు గురవుతున్నారు. మహిళల కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా..దాడులు, వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు నవ వధువు బలైంది..

Husband Kills wife: పెళ్ళైన నాలుగు నెలలకే భార్యని చంపిన భర్త.. కారణం తెలిస్తే షాకే!

ఎంతో అభివృద్ధి చెందిన నేటికాలంలో కూడా మహిళలు, యువతులపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా లైంగిక , వరకట్న వేధింపులకు ఆడవాళ్లు గురవుతున్నారు. మహిళల కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా..దాడులు, వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు నవ వధువు బలైంది. ఎన్నో ఆశలతో నాలుగు నెలల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమెను భర్తే యముడిగా మారి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.


కర్ణాటక(Karnataka)లోని బెలగావి(Belgaum) జిల్లాలోని ముదలకి తాలూకాలో కమలాదిన్ని గ్రామానికి చెందిన ఆకాష్ కుంబర్ అనే తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి సాక్షి ఆకాష్ కుంబర్(20)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఇటీవల ఆమెను చంపి మృతదేహాన్ని ఇంట్లో మంచం కింద దాచిపెట్టి పారిపోగా... ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం తీసుకుని రమ్మంటే ఆ యువతి కట్నం తీసుకురావడాన్ని వ్యతిరేకించిందని.. అందుకే భార్యను హత్య చేసి మంచం కింద దాచి పెట్టినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడైన ఆకాశ్ పై ముదలకి పీఎస్ లో మృతురాలి బంధువులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


పెళ్లయిన నాటి నుంచి పుట్టింటి నుంచి మరింత కట్నం(Dowry) తీసుకుని రమ్మనమని ఆకాష్ ..తన భార్య అయిన సాక్షిని నిత్యం వేధించే వాడని మృతురాలి బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం తన భార్య సాక్షితో వరకట్నం విషయంలో గొడవ పెట్టుకున్నాడు. ఆమె దారుణంగా కొట్టి హత్య చేసి పారిపోయాడని బంధువులు చెుతున్నారు. మహిళ హత్య జరిగినప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. పని మీద ముంబై(Mumbai)కి వెళ్లిన నిందితుడు ఆకాష్ తల్లి..తిరిగి ఇంటికి రాగా...ఆమెకు కోడలు సాక్షి మృతదేహం కనిపించింది. దీంతో ఆకాష్ చేసిన హత్య వెలుగులోకి వచ్చింది. అతడిని కఠినంగా శిక్షించాలని సాక్షి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. కంపెనీ యజమాని అరెస్ట్..

మెడికల్ కాలేజీ వాటర్ ట్యాంకులో కుళ్లిన స్థితిలో శవం..

Updated Date - Oct 09 , 2025 | 02:25 PM