Share News

Coldrif Cough Syrup: కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. కంపెనీ యజమాని అరెస్ట్..

ABN , Publish Date - Oct 09 , 2025 | 08:35 AM

ఆ దగ్గు మందులో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరితమైన ఇండస్ట్రియల్ కెమికల్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. డైథిలిన్ గ్లైకాల్ మనుషులు వాడకూడదు. డైథిలిన్ గ్లైకాల్ ఉన్న మందుల్ని తీసుకోవటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

Coldrif Cough Syrup: కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. కంపెనీ యజమాని అరెస్ట్..
Coldrif Cough Syrup

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్‌ అరెస్టయ్యారు. మధ్య ప్రదేశ్ పోలీసులు ఈ ఉదయం చెన్నైలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్ రిఫ్ దగ్గు మందు తాగి ఒక్క మధ్య ప్రదేశ్‌లోనే 20 మంది దాకా చిన్న పిల్లలు చనిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు రంగనాథన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం అరెస్ట్ చేశారు.


రాజస్థాన్ రాష్ట్రంలోనూ కోల్డ్‌రిఫ్ తాగి చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లలు కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వినియోగాన్ని నిషేధించాయి. కోల్డ్‌రిఫ్‌ను చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు నివారించడానికి వాడతారు. ఆ దగ్గు మందుపై ఆరోపణలు రావటంతో తమిళనాడు అధికారులు సాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయించారు. ఆ దగ్గు మందు ప్రమాదకరమైనదని ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి.


ఆ దగ్గు మందులో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరితమైన ఇండస్ట్రియల్ కెమికల్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. డైథిలిన్ గ్లైకాల్ మనుషులు వాడకూడదు. డైథిలిన్ గ్లైకాల్ ఉన్న మందుల్ని తీసుకోవటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, ప్రాణాలు పోయే అవకాశం ఉంది. గతంలో ఈ కెమికల్ కారణంగా చాలా మంది చనిపోయినట్లు సమాచారం. పలు దేశాలు మెడిసిన్స్‌లో ఈ కెమికల్ వాడకాన్ని నిషేధించాయి. అయినా కూడా కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్ కోసం ఈ కెమికల్‌ను వాడుతున్నాయి.


ఇవి కూడా చదవండి

గురకపెట్టి నిద్రపోతున్న భర్త.. భార్య చేసిన పనికి చావు బతుకుల్లో..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..

Updated Date - Oct 09 , 2025 | 08:53 AM