Home » Karimnagar
కేజీబీవీలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఎల్లంపల్లిలోని కేజీబీవీ పాఠశాల, అంతర్గాంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ర్థుల బోధన శైలి, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ వైద్యులకు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సందర్శించారు.
కొత్త నిబంధనలు ఎత్తివేసి, పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో అధికారులతో మాట్లాడి రాజీవ్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పంట మార్పిడితోనే అధిక దిగుబడి సాధ్యమవు తుందన్నారు.
అరవై సంవ త్సరాలు పైబడిన వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లలదేనని మంథని సీనియర్ సివిల్ జడ్జి వీ. భవానీ స్పష్టంచేశారు. కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవా అధికార సమితి ఆధ్వర్యంలో సోమవారం వృద్ధుల సంక్షేమ చట్టం-2007పై అవగాహన సమావేశం లో జడ్జి భవానీ మాట్లాడారు.
రోడ్డు ప్రమా దాలతో ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతు న్నాయని రామగుండం సీపీఅంబర్ కిశోర్‌ఝా అన్నారు. సోమవారం అరైవ్, అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా సీపీ గోదావరిఖని బీ గెస్ట్‌హౌస్ మూలమలుపు నుంచి ఇందారం క్రాస్ రోడ్డు వరకు బ్లాక్‌స్పాట్‌లను సందర్శించారు.
అంతర్గాం మండల పరిధిలోని లింగాపూర్ గ్రామాన్ని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య సోమవారం సందర్శిం చారు. లింగాపూర్‌లో లెదర్ పార్కు ఏర్పాటు కోసం నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.
అధికారుల సంఘం హెచ్‌ఎంఎస్‌పై చేసిన ఆరోపణ లను ఖండిస్తున్నామని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదివారం తిలక్‌నగర్‌లోని హెచ్‌ఎంఎస్ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో అండర్ గ్రౌండ్‌లో పని చేస్తున్న యువ కార్మికులకు ప్రమాదాలకు గురవుతున్నారని, దీనికి అధికారుల సంఘం సమాధానం చెప్పాల న్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్‌లను అమలు చేయా లని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. ఆదివారం రాణిరుద్రమాదేవి క్రీడాప్రాంగణంలో రన్‌ఫర్ జస్టిస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాణిరుద్ర మాదేవి క్రీడప్రాంగణం నుంచి పన్నూర్ సెంటర్ వరకు రన్ నిర్వహిం చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. జిల్లా 4వ మహాసభలు పట్టణంలోని ఎం.బి.గార్డెన్ ఏర్పాటు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి జెండావిస్కరణ చేశారు.