Share News

క్రీడల్లో గెలుపోటములు సహజం

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:03 AM

క్రీడల్లో గెలు పోటములు సహజమని ఎంపీడీవో శైలజారాణి, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు అన్నారు. సోమవారం జెఎన్‌టీయు కళాశా లలో సీఎం కప్‌ మండల స్థాయి బహుమతి ప్రధానోత్స వంలో మాట్లాడారు. విద్యార్థులు క్రీడలను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

క్రీడల్లో గెలుపోటములు సహజం

రామగిరి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): క్రీడల్లో గెలు పోటములు సహజమని ఎంపీడీవో శైలజారాణి, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు అన్నారు. సోమవారం జెఎన్‌టీయు కళాశా లలో సీఎం కప్‌ మండల స్థాయి బహుమతి ప్రధానోత్స వంలో మాట్లాడారు. విద్యార్థులు క్రీడలను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆటలతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సీఎం కప్‌ మం డల ఇన్‌చార్జి సతీష్‌, ఎంపీడీవో సూపరింటెంటెండ్‌ ఉమే శ్‌, కళాశాల పిడిలు పింగిళి కృష్ణారెడ్డి, సునీల్‌కుమార్‌, వల్లంబట్ల శ్రీనివాస్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతోపాటు శరీర దృఢత్వం పెరుగుతుందని ఎం ఈఓ అనసూరి నరేంద్రచారి, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం గండ్ర దేవెందర్‌రావు అన్నారు. సోమవారం ఉన్నత పాఠశాలలో సీఎం కప్‌ మండలస్థాయి క్రీడలను మం డల అభివృద్ధి అధికారి భాస్కర్‌రావు, తహసీల్దార్‌ యాకన్న, ఎస్‌ఐ మధుకర్‌తో కలిసి ప్రారంభించారు. కబడ్డీ బాలుర విభాగంలో ఎలిగేడు, బాలికల్లో సుల్తా న్‌పూర్‌ ప్రథమ, ద్వితీయలో బాలురు శివపల్లి, బాలికలు ఎలిగేడు టీం గెలిచింది. ఖోఖోలో బాలురు ధూళికట్ట, బాలికలు సుల్తాన్‌పూర్‌ ప్రథమ, ద్వితీయలో బాలురు సుల్తాన్‌పూర్‌, బాలికలు ఎలిగేడు జట్టు గెలిచాయి. వాలీ బాల్‌ ప్రథమస్థానంలో సుల్తాన్‌పూర్‌ జట్టు బాలురు, బా లికలు ద్వితీయ ధూళికట్ట జట్టు గెలిచింది. అధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. ఎస్‌జీఎఫ్‌ మండల కన్వీనర్‌ ప్రణయ్‌, పీడీలు శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన సీఎం కప్‌ పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ తూమ్‌ రవీం దర్‌ పటేల్‌, సర్పంచ్‌ అంగోతు రవి నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో సీఎం కప్‌ క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి. నైపుణ్యం గల క్రీడా కారులుగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు. ఖోఖోలో అంత ర్గాం, కబడ్డీలో పొట్యాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారు. ప్రధానోపాధ్యాయులు ఏకాంబరం. ఎంపీడీ ఓ తిరుపతి, పీఈటీ శోభారాణి, పాల్గొన్నారు.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): బసంత్‌నగర్‌ అలా్ట్రటెక్‌ ఐఎంఎస్‌ పాఠశాల ఆవరణలో సోమవారం సీఎం కప్‌ పోటీలను ఎంపీడివో పొల్సాని శశికళ, ఎస్‌ఐ నూతి శ్రీధర్‌లు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేం దుకు పోటీలు గొప్ప అవశామన్నారు. క్రీడలను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ మహేంద్రన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రేమనంద్‌, సోమశేఖర్‌, కృష్ణమూర్తి, ప్రకాశ్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:03 AM