Share News

అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నడపాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:18 AM

అంగ న్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నడిపిం చాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి కవిత అన్నారు. మంగళవారం నర్సాపూర్‌లోని మూడు కేంద్రాలను పరిశీలించారు.

అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నడపాలి

ఎలిగేడు, ఫిబ్రవరి3(ఆంధ్రజ్యోతి): అంగ న్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నడిపిం చాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి కవిత అన్నారు. మంగళవారం నర్సాపూర్‌లోని మూడు కేంద్రాలను పరిశీలించారు. అనంత రం గర్భిణీలకు సీమంతం, పిల్లలకు అన్న ప్రసాన, అక్షరభ్యాసం సర్పంచ్‌ పల్లెర్ల వెం కటేష్‌గౌడ్‌ చేయించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు సమయం పాటించాలన్నారు. ప్రతి నెల 5 ఏళ్ల లోపు పిల్లల బరువు, ఎత్తు, కొల తలు చేయాలన్నారు. బాలింతలకు నెలరో జుల పాటు వారి ఇంటికి భోజనం అందిం చాలన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ సూర్య కళ, ఉపసర్పంచ్‌ గోసిక రవీందర్‌, జీపీ కార్య దర్శి లలిత, జీపీఓ రాకేష్‌, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

దివ్యాంగులైన పిల్లలు ఫిజియోథెరపి క్యాం పులను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈ ఓ నరేంద్రచారి తెలిపారు. ధూళికట్ట ప్రాథ మిక పాఠశాలలోని భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపి క్యాంపును ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి మంగళవారం డాక్టర్‌ అజయ్‌ అందుబాటులో ఉంటాడ న్నారు. దివ్యాంగులను పాఠశాలలో చేర్పించి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. సర్పంచ్‌ మారం కొమురయ్య, ఉపసర్పంచ్‌ మేచినేని అండాలు, జీపీ కార్యదర్శి ఆరెపల్లి పున్నమయ్య, విలీన విద్యాబోధ కులు సంతోష్‌, రమేష్‌లు ఉన్నారు.

ముత్తారం, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా మండల కేం ద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం1లో చిన్నారు లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 6 ఏళ్ల లోపు చిన్నారుల ఆరోగ్యాన్ని పరిశీలించారు. డాక్టర్‌ కుమార్‌, డాక్టర్‌ సుమతి మాట్లాడు తూ, చిన్నారుల ఎదుగుదల, ఎత్తు, బరువుల ను తనిఖీ చేసినట్లు తెలిపారు. తక్కువ బరు వు ఉన్న పిల్లలను గుర్తించి, వారికి పౌష్టికా హారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఫార్మసిస్ట్‌ రఘునాయక్‌, ఏఎన్‌ఎం పుష్పలత, అంగన్‌వాడీ టీచర్‌ సత్యవాణి, ఆయా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:18 AM