Share News

క్యాన్సర్‌ మహమ్మారిని పారదోలాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:20 AM

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ మహమ్మారిని పారదోలాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగు లకు పండ్లు పంపిణీ చేశారు.

క్యాన్సర్‌ మహమ్మారిని పారదోలాలి

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రాణాంతకమైన క్యాన్సర్‌ మహమ్మారిని పారదోలాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. మంగళవారం ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగు లకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలోని రోగులకు క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించారు. క్యాన్సర్‌ వ్యాధి సోకకుండా తీసుకో వాల్సిన జాగ్రత్తలు వివరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, న్యాయవాదులు వొడ్నాల రవిందర్‌, మాడూరి ఆంజనేయులు, జోగుల రమేష్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:20 AM