Share News

సమ్మక్క హుండీల లెక్కింపు

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:04 AM

సుల్తానా బాద్‌ మండలం నీరుకుళ్ల సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఈ సారి 21 లక్షల 988 రూపాయల ఆదాయం సమకూ రింది.

సమ్మక్క హుండీల లెక్కింపు

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సుల్తానా బాద్‌ మండలం నీరుకుళ్ల సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఈ సారి 21 లక్షల 988 రూపాయల ఆదాయం సమకూ రింది. మానేటి రంగనాయకుల స్వామి ఆలయంలో జాతర కమిటీ చైర్మన్‌ పొన్నం చంద్రయ్య గౌడ్‌, డైరెక్టర్లు నేరెల్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్‌, కోమల ప్రశాంత్‌, సిరిసిల్ల కళావతి, ఆలయ ఈఓ శంకర య్య, ప్రవీణ్‌ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు. జాతర వేలం పాటల ద్వారా రూ 5 లక్షల 80 వేల 332 రూపాయలు, టికెట్ల విక్రయం ద్వారా 3లక్షల 10 వేల 870 రూపాయలు, హుండీల ద్వారా 12 లక్షల 7 వేల 686 రూపాయల అదాయం లభించిందని చైర్మన తెలిపారు. మొత్తంగా 21 లక్షల 988 రూపాయలు జాతర ఆదాయం వచ్చిందన్నారు. వీటితో పాటు ఒక గ్రాము 700 మిల్లీ గ్రాములు బంగారం, 375 గ్రాము లు మిశ్రమ వెండి కానుకలు కూడా వచ్చాయన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి): కొలనూర్‌ సమ్మక్క, సారల మ్మ జాతర హుండీ ఆదాయం రూ.11.45 లక్షల 668 రూపాయలు సమకూరాయి. పది హుండీలను లెక్కిం చగా రూ,19వేల విలువైన రెండు గ్రాముల బంగారం, రూ,45 వేల విలువైన 250గ్రాముల వెండితోపాటు టిక్కెట్ల అమ్మకాలు, తై బజార్‌ తదితర వాటికి జాతర ఆదాయం రూ,11.45 లక్షలకు పైగా సమకూరాయి. గతంలో నిర్వహించిన జాతర ఆదాయం రూ,10.20 లక్షల ఆదాయం కంటే ప్రస్తుత ఆదాయం రూ,1.25 లక్షలు అదనంగా పెరిగాయి. సర్పంచ్‌ పల్లె కనుకయ్య, పర్యవేక్షణ అధికారి రాజశేఖర్‌, భ్రమరాంబ మల్లికా ర్జున స్వామి ఆలయ ఈవో సదయ్య,జాతర కమిటీ చైర్మన్‌ కొలిపాక మదనయ్య, సర్పంచ్‌ గ్యారవేని విజయ,నాగరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌ ముద్దసాని కుమారస్వామి,జాతర కమిటీ డైరెక్టర్లు,మాజీ సర్పంచుల తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:04 AM