Share News

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన పరిశీలకులు

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:15 AM

మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పద్మజరాణి అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను మంగళవారం పరిశీలించారు.

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన పరిశీలకులు

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పద్మజరాణి అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. జూనియర్‌ కళాశాలలోని పోలింగ్‌ స్టేష న్లను ఆమె సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. సర్వీస్‌ ఓటర్లు, పీడీ ఆక్ట్‌ ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ పోలింగ్‌స్టేషన్‌ ప్రిసైడింగ్‌ అధికారితో పాటు నలుగురు సిబ్బంది ఉండాలన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌లను సరి చూసుకుని స్టిక్కరింగ్‌ చేసుకోవాలని, పోలింగ్‌ మెటిరియల్‌, బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌పై సూచనలు జారీ చేశారు. పేపర్‌ సీల్‌, ఇండెలేబుల్‌ ఇంక్‌, ఓటర్లు లిస్టు మార్కెట్‌ కాపీ సరి చూసుకోవాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, ఆరేపల్లి రాజయ్య, రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:15 AM