అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి మృతి
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:13 AM
కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (79) మంగళవారం హైదరాబాద్‌లో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపతిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
మంథని, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (79) మంగళవారం హైదరాబాద్‌లో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపతిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. సర్పంచ్‌గా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజ కీయ, ప్రజా జీవితం గడిపిన ఆయన ప్రజా నాయకుడిగా మంథని నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎమ్మెల్యేగా పని చేసిన 1994-1999 వరకు రైతులకు సాగునీరు, ప్రజలకు కరెంట్ కష్టాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పని చేసిన స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుపై పోటీ చేసి ఓడిపోయారు. ముత్తా రం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి సుదీర్ఘకాలం సర్పంచ్‌గా, ముత్తారం ఎంపీపీగా పని చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాటారంలో జరి గిన కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి మంథనికి వస్తుండగా ఆరెంద క్రాస్‌రోడ్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై మావోయిస్టులు కాల్పులు జరపగా త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన తనయుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డికి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కోసం బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో చేశారు. ప్రస్తుతం సునీల్‌రెడ్డి బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. రాంరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాంరెడ్డి భౌతికకాయాన్ని ఆయన అభిమానుల సందర్శనార్థం బుధవారం మంథనికి తరలి స్తున్నారు. అంత్యక్రియలు గురువారం సీతం పల్లి శివారులోని వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాంరెడ్డి మృతిపై మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతోపాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.