• Home » Karimnagar

Karimnagar

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌

ప్రజా పాలనకు వెయ్యి రోజులు దాటిన సందర్భంగా చలో సిరిసిల్ల పేరిట తలపెట్టిన సీఎం భారీ బహిరంగ సభ విజయవంతం కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌గా మారింది. ఈనెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్ర, లక్ష మంది జన సమీకరణ లక్ష్యంగా బహిరంగ సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు

ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు

ఖరీఫ్‌ సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. అక్టోబర్‌ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 325 కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈసారి కూడా పంట దిగుబడికి అనుగుణంగా అంతే స్థాయిలో కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావా లని ఏర్పాట్లు చేస్తున్నారు.

మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములుతో కలిసి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

వీబీజీరామ్‌జీ పథకంలో పనులు గుర్తించాలి

వీబీజీరామ్‌జీ పథకంలో పనులు గుర్తించాలి

గ్రామపంచాయతీలో వీబీజీరామ్‌జీ పనుల్లో 4 కేటగిరిల్లో 375 పనులను గుర్తించాలని జడ్పీ సీఈవో నరేందర్‌ సూచించారు. జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన వికసిత్‌ గ్రామపంచాయతీ ప్రణాళికపై జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట

మహిళా సంక్షేమానికి పెద్దపీట

తెలంగాణ ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలుస్తోందని, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివా రం రంగంపల్లి ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఉపాధిహామీ పనులపై డిజిటల్‌ నిఘా.. నకిలీ హాజరుకు చెక్‌

ఉపాధిహామీ పనులపై డిజిటల్‌ నిఘా.. నకిలీ హాజరుకు చెక్‌

ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన డిజిటల్‌ ఆధారిత పర్యవేక్షణ విధా నానికి మూడు నెలలు అవుతుంది.

ఇంకా.. సరిపోలేదు..

ఇంకా.. సరిపోలేదు..

అల్పపీడన ప్రభావంతో జిల్లాను వర్షాలు ముంచెత్తుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. గడిచిన మూడు రోజులుగా ఎంతగానో ఊరించిన వానలు అంతలోనే ఉసూరుమనిపించాయి. మోస్తారును మించి వర్షం కురవలేదు.

జగిత్యాల :  గోదాముల కోసం అన్వేషణ

జగిత్యాల : గోదాముల కోసం అన్వేషణ

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాములు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు అనువైన ప్రభుత్వ, ప్రైవేట్‌ గోదాములను గుర్తించే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు.

బై బై గణేశా..

బై బై గణేశా..

విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా.. గణేష్‌ మహారాజ్‌కి జై.. అంటూ భక్తుల నీరాజనాలు మార్మోగాయి. ఉదయం నుంచి తెల్లవారులు బొజ్జ గణపయ్య శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు.

అన్నదాతలకు ఊరట

అన్నదాతలకు ఊరట

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈయేడు వానాకాలం సీజన్‌లో వర్షాలు సరిగా కురవలేదు. అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులు సాగు చేశారు. అనంతరం సరైన వర్షాలు కురవకపోవడంతో కళ్ళ ముందు బీటలు వారుతున్న పొలాలను చూసిన రైతులు మనోవేదనకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి