Home » Kandula Durgesh
అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు..
రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే స్ఫూర్తితో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, నవ భారతావనిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కడప జిల్లా గండికోట ఉత్సవాలు ఈ సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ఈ శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రుషికొండ నిర్మాణాలపై మళ్ళీ నిర్మాణాలు చేసే అవకాశం ఉందని.. పైన రెండు ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉందని మంత్రి పయ్యావుల తెలిపారు. రుషికొండ చివరి రెండు బ్లాక్‌లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు, టూరిస్ట్ అవసరాల కోసం ఉంచుతామని చెప్పారు.
రుషికొండ ప్యాలెస్ వినియోగానికి సంబంధించి టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు.
విశాఖ సమ్మిట్ ద్వారా 50వేల ఉద్యోగాలు వస్తాయని భావించామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లిబర్డ్ ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తున్నామని తెలిపారు.
ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. నవంబరు 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు లండన్‌లో పర్యటిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలని గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రకృతి అందాలను అభివృద్ధి చేయడం ద్వారా నేడు అద్భుతమైన ప్రదేశాలుగా మారాయని వివరించారు. పర్యాటక రంగంలో సుస్థిరమైన మార్పు వచ్చిందని చెప్పడానికి ఏపీ ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.