Home » KADAPA
విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.
మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు.
మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎ.జనార్దన్ తెలిపారు.
ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. పొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్న ఆరుగురు బెట్టింగ్ ముఠా సభ్యులని బుధవారం అరెస్టు చేశారు కడప జిల్లా పోలీసులు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి.. 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి.. అద్భుతంగా రాణించింది. 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్లో శ్రీ చరణి వికెట్ తీసింది.
ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. 17 వేల ఎకరాల్లో ఉల్లి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు అవినాశ్ రెడ్డి.
ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారిమఠం విరాజిల్లుతోంది. వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.
తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన జీవో-32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
కడప సెంట్రల్ జైలుకు వచ్చిన NIA అధికారులు.. రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్నారు. జులై 1న ఇద్దరు ఉగ్రవాదుల్ని తమిళనాడు ఐబీ అధికారులు అరెస్టు..
కడప నగరంలోని శంకరాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.