Home » Jubilee Hills
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ కీలక చర్యలు చేపట్టింది.
కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధే తనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపిస్తుందని మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. తాను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తోందని ఎప్పుడూ అనుకోలేదని మాగంటి సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ తో కలిసి ఆయన సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యుర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ బస్తీల్లో రూ.4.62 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీరు, డ్రైనేజీ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.