Jubilee Hills by-election: ఎన్నికల నిర్వహణలో మీరే కీలకం
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:57 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సోమవారం సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
- నోడల్, సెక్టార్ అధికారులతో కర్ణన్
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills by-election) షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(Election Officer, GHMC Commissioner RV Karnan) సోమవారం సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నోడల్ అధికారులు, ప్రాంతాల వారీగా పర్యవేక్షించే సెక్టార్ అధికారుల పాత్ర అత్యంత కీలకమన్నారు.

సెక్టార్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తాగునీరు, లైటింగ్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, ర్యాంప్‌లు తదితర కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఎన్నికల ఘటనల ఆధారంగా స్థానిక తహశీల్దార్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, బూత్ లెవల్ అధికారుల సహకారంతో ఆందోళనలు జరిగే అవకాశం ఉన్న పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. అనంతరం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలోని డిస్ర్టి బ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ (డీఆర్‌సీ) కేంద్రాన్ని కర్ణన్ సందర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం
Read Latest Telangana News and National News