Home » Jubilee Hills Bypoll
బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల ఆర్వో అధికారి సాయిరాం స్వీకరించారు. ప్రధాన మూడు పార్టీల్లో బీఆర్‌ఎస్ మొదటి నామినేషన్ దాఖలు చేసింది.
గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేశారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎల్లుండి (ఈనెల 17) నామినేషన్ వేనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు, పోలీసుల తనిఖీల్లో నగదు, మద్యంతో పాటు ఉచితంగా పంపిణీ చేసే కానుకలూ పట్టుబడుతున్నాయి. అత్యల్పంగా డ్రగ్స్ కూడా పట్టుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఫాం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40 లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
ఒకే ఇంట్లో ఒకే వ్యక్తికి 3 ఓట్లు ఉండడంతో బోగస్ ఓట్ల బాగోతం బయటపడింది. దీంతో ఎన్నికల అధికారులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశాడు. వెంటనే ఎలక్షన్ కమిషన్ అధికారులు విచారణ చేపట్టారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని పలువురు వక్తలు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (ఎస్ఎస్టీ) సోమవారం చేపట్టిన తనిఖీల్లో భాగంగా రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌కు చెందిన జైరాం తలాసియా కారులో యూసుఫ్‌గూడ వైపు వెళ్తున్నారు.
ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు పోటీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 1000 మంది నిరుద్యోగులం 30 అంశాలపై నామినేషన్ దాఖలు చేసి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించే లక్ష్యంతో పని చేస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు వెల్లడించారు.