Maganti Sunitha Files Nomination: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:01 PM
బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల ఆర్వో అధికారి సాయిరాం స్వీకరించారు. ప్రధాన మూడు పార్టీల్లో బీఆర్‌ఎస్ మొదటి నామినేషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉపఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. మూడవ రోజు జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) మొదటి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల ఆర్వో అధికారి సాయిరాం స్వీకరించారు. ప్రధాన మూడు పార్టీల్లో బీఆర్‌ఎస్ మొదటి నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ , పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.
కాగా.. నామినేషన్ దాఖలు చేసే ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పూజలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనవాయితీ ప్రకారం నామినేషన్ వేయడానికి ముందు పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేసేవారు. అదే ఆనవాయితీని భార్య సునీత కొనసాగించారు. మాగంటి సునీతతో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాగంటి కుటుంబ సభ్యులు ఉన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరునే ప్రకటించింది ఆ పార్టీ. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా నవీవ్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక కొద్దిరోజులుగా బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై కొనసాగిన సస్పెన్షన్‌కు ఈరోజు (బుధవారం) తెరపడింది. బీజేపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థి పేరును ప్రకటించింది కమలం పార్టీ. బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారు అయ్యింది. ఇక గత రెండు రోజులుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. దాదాపు 20 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. 22న నామినేషన్లు పరిశీలించనుండగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 11న పోలింగ్ జరుగనుండగా... 14న ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి..
డాక్టర్ నిర్లక్ష్యంతో యువతి బలి.. ఏం జరిగిందంటే
దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్‌ఎస్.. ఎంపీ ఫైర్
Read Latest Telangana News And Telugu News