Avind Slams KTR: దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్‌ఎస్.. ఎంపీ ఫైర్
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:42 AM
42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. 42 శాతం అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదన్నారు.
నిజమాబాద్, అక్టోబర్ 15: జూబ్లీహిల్స్‌లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ (Former Minister KTR) అనటం హాస్యాస్పదమని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్‌ఎస్ పార్టీ అని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో అపార్టుమెంట్‌లో 43 ఓట్లు దొంగ ఓట్లైతే, బోధన్‌లో బీఆర్‌ఎస్ హయాంలో 42 దొంగ పాస్‌పోర్టులు ఇచ్చిన సంగతి మరిచారా అంటూ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్థులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బీఆర్‌ఎస్ పార్టీనే అని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్, మత్తు పదార్థాల దందాకు తెరలేపింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ క్లబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేసింది కేటీఆర్ అని మండిపడ్డారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ విమర్శించారు. 42 శాతం అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదన్నారు. ఈ అంశంలో బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు. జిల్లాలో ఇటీవల సీఎం పర్యటనతో ఒరిగిందేమి లేదన్నారు. జిల్లాలో ఆర్వోబీల నిధులు వెంటనే విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానని.. దీపావళి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆర్వోబీల నిధులు కేంద్రం ఇచ్చినా... రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాలకు వాడుకుందని ఆరోపించారు. గత ప్రభుత్వం వాడుకున్న డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం రికవరీ చేయాలని.. పనుల కోసం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గద్దన్నారు. జాతీయ పసుపు బోర్డు కోసం స్థలం అడిగితే ఇవ్వడం లేదని ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి..
ఊపందుకోనున్న నామినేషన్లు.. నేడే బీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్
డాక్టర్ నిర్లక్ష్యంతో యువతి బలి.. ఏం జరిగిందంటే
Read Latest Telangana News And Telugu News