Ranga Reddy Abortion Case: డాక్టర్ నిర్లక్ష్యంతో యువతి బలి.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Oct 15 , 2025 | 10:20 AM
యువతికి అబార్షన్ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంది డాక్టర్. అయితే అబార్షన్ చేసే క్రమంలో వైద్యం వికటించి యువతి పరిస్థితి విషమంగా మారింది.
రంగారెడ్డి, అక్టోబర్ 15: జిల్లాలోని శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతి.. ఓ వ్యక్తిని ప్రేమించి గర్భవతి అయ్యింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయించాడు. దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్‌కు ప్రయత్నించాడు.. కానీ అక్కడే అనుకోని ఘటన చోటు చేసుకోవడంతో యువతి ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
హోంగార్డ్ మధుసూదర్ ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేశాడు. దీంతో యువతికి అబార్షన్ చేయించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను సంప్రదించాడు. అందుకు ఆమె ఒప్పుకుని యువతికి అబార్షన్ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంది. అయితే అబార్షన్ చేసే క్రమంలో వైద్యం వికటించి యువతి పరిస్థితి విషమంగా మారింది. యువతి పరిస్థితి విషమించడంతో ఆమెను హుటాహుటిన నగరంలోని హాస్పటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ హాస్పిటల్‌కు తరలిస్తుండగానే మార్గం మధ్యలో యువతి మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితురాలు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ పరారీలో ఉన్నట్లు సమాచారం.
నిందితురాలపై గతంలో పోలీసు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మధుసూదన్ శంషాబాద్ పరిధిలో పోలీస్ క్లూస్ టీంలో విధులు నిర్వహిస్తున్నాడు. మృతురాలు షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. యువతి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
ఇవి కూడా చదవండి..
జిల్లాల యాత్రకు.. కవిత శ్రీకారం..
ఊపందుకోనున్న నామినేషన్లు.. నేడే బీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్
Read Latest Telangana News And Telugu News