Hyderabad Teen Tortured: నేరేడ్‌మెట్‌లో దారుణం.. చీకటి గదిలో బంధించి చిత్రహింసలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:06 PM
ప్రభాత్‌ను గదిలో బంధించిన స్నేహితులు.. బీర్ బాటిళ్లు, కేబుల్ వైర్లు, కట్టెలతో విచక్షణ రహితంగా చిత్ర హింసలకు గురి చేశారు. ప్రభాత్ అపస్మారక స్థితికి చేరుకున్న తరువాత తెల్లవారు జామున ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు.
హైదరాబాద్: నేరేడ్‌మెట్ వినాయక్ నగర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వినాయక్ నగర్‌కి చెందిన మదాస్ ప్రభాత్(16) అనే బాలుడిని తన స్నేహితులు నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. శాంతినగర్, లాలాపేటకి చెందిన 20 మంది స్నేహితులు.. దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు మాట్లాడుకుందాం అని పిలిచారు. అనంతరం రాత్రంతా శాంతినగర్‌లోని ఒక ఇంట్లో ప్రభాత్‌ను నిర్బంధించారు.
ప్రభాత్‌ను గదిలో బంధించిన స్నేహితులు.. బీర్ బాటిళ్లు, కేబుల్ వైర్లు, కట్టెలతో విచక్షణ రహితంగా చిత్ర హింసలకు గురిచేశారు. ప్రభాత్ అపస్మారక స్థితికి చేరుకున్న తరువాత తెల్లవారు జామున ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు. కుటుంబ సభ్యులు ప్రభాత్ ఒంటిపై గాయాలు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరగా.. పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. కేసు పెట్టేంత పెద్ద విషయం కాదని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని బాధితుడి కుటుంబ సభ్యుల కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్ కేసులో కౌంటర్ వేయండి
Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్