Jubilee Hills by-election: తనిఖీల్లో రూ.25 లక్షల నగదు స్వాధీనం
ABN , Publish Date - Oct 14 , 2025 | 07:23 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (ఎస్‌ఎస్‌టీ) సోమవారం చేపట్టిన తనిఖీల్లో భాగంగా రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌కు చెందిన జైరాం తలాసియా కారులో యూసుఫ్‌గూడ వైపు వెళ్తున్నారు.
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election) నేపథ్యంలో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (ఎస్‌ఎస్‌టీ) సోమవారం చేపట్టిన తనిఖీల్లో భాగంగా రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌కు చెందిన జైరాం తలాసియా కారులో యూసుఫ్‌గూడ(Yusufguda) వైపు వెళ్తున్నారు.

మైత్రీవనం క్రాస్‌రోడ్డు(Maitreevanam Crossroads) వద్ద, సారథి స్టూడియో సమీపంలో ఎస్‌ఎస్‌టీ బృందం తనిఖీ చేయగా కారులో రూ.25 లక్షల నగదు లభ్యమైంది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాధీనం చేసుకున్న నగదును ఎస్‌ఎస్‌టీ బృందం అధికారులు స్థానిక మధురానగర్ పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
వేరుశనగ రైతులకు ఉచిత విత్తనాలు
Read Latest Telangana News and National News