Share News

Jubilee Hills by-election: మేం 300 మందిమి నామినేషన్లు వేస్తాం.. మేం 1000 మంది..

ABN , Publish Date - Oct 14 , 2025 | 07:04 AM

ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‏కు పోటీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో 1000 మంది నిరుద్యోగులం 30 అంశాలపై నామినేషన్‌ దాఖలు చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించే లక్ష్యంతో పని చేస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు వెల్లడించారు.

Jubilee Hills by-election: మేం 300 మందిమి నామినేషన్లు వేస్తాం.. మేం 1000 మంది..

- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నిరసనల వెల్లువ

- కాంగ్రెస్‏ను ఓడిస్తామని ప్రకటనలు

హైదరాబాద్: ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‏కు పోటీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by-election) 1000 మంది నిరుద్యోగులం 30 అంశాలపై నామినేషన్‌ దాఖలు చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించే లక్ష్యంతో పని చేస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు వెల్లడించారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఒక్క జనరల్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాల వద్ద వారు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కందరపల్లి కాశీనాథ్‌, వైస్‌చైర్మన్‌ భూక్యా కూమార్‌, జనరల్‌ సెక్రటరీ ఆర్‌కె.వన్నార్‌ చోళ తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణలో ఉద్యోగాల చోరీ

రాహుల్‌గాంధీ ఓటు చోరీ అంటూ దేశమంతా తిరుగుతున్నారని, తెలంగాణలో ఉద్యోగాల చోరీ జరుగుతోందని పలువురు వక్తలు అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో 300 మంది నామినేషన్లు వేస్తారని నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రకటించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ నాయకుడు జనార్దన్‌ అధ్యక్షతన గ్రూప్‌-1లో జరిగిన అక్రమాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు రాకే్‌షరెడ్డి,


city2.3.jpg

రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(భీమ్‌ రావు అంబేడ్కర్‌)రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌, మోతీలాల్‌ నాయక్‌, సంజీవ్‌ నాయక్‌, కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు అశోక్‌, గంగాధర్‌ తదితరులు మాట్లాడారు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. ప్రభుత్వం గ్రూప్‌-1ను మరింత జఠిలం చేస్తోందని రాకే్‌షరెడ్డి ఆరోపించారు. నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేయాలని ప్రభుత్వం యత్నిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో చంద్రశేఖర్‌, ఇంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

వేరుశనగ రైతులకు ఉచిత విత్తనాలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 14 , 2025 | 07:04 AM