Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాం..
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:07 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని పలువురు వక్తలు తెలిపారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)లో ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని పలువురు వక్తలు తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు వెంకటస్వామి(Venkataswamy), తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షుడు ప్రఫుల్ రాంరెడ్డిలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయని నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామన్నారు. ఉద్యమకారులకు గతంలో బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు అన్యాయం చేశాయని వారు ఆరోపించారు.

ఈ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా తాము ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామన్నారు. తాము బరిలో నిలిపే అభ్యర్థికి జూబ్లీహిల్స్ ప్రజలు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రన్న, మోహన్ బైరాగి, అంసోల్ లక్ష్మణ్, నాగుల శ్రీనివా్‌సయాదవ్, ప్రజ్యోత్‌కుమార్, సుజీ, లావణ్య, సుచరిత, బోయపల్లి రంగారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
Read Latest Telangana News and National News