Home » Jubilee Hills By-Election
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గులాబీ పార్టీ కీలక నేతలు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ బాస్ కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి చర్చిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరక్క మజ్లిస్ క్యాండిడేట్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టిందని, మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ సానుభూతి ఓట్ల కోసం వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ నామినేషన్ల ఘట్టమే రసకందాయమైంది. మొత్తం 211 మంది అభ్యర్థులు ఈ ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ నామినేషన్‌పై అభ్యంతరాలు..
తెలంగాణ ఆవిర్భావంలో ప్రొ. కోదండ రామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరడమైందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ నియమించింది బీఆర్ఎస్ పార్టీ. అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా.. 40 మంది సీనియర్ నేతల పేర్లను విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక పోరు మొదలు కానుంది. నామినేషన్ల దాఖలు పర్వం చివరి అంకానికి చేరుకోవడంతో వ్యూహ, ప్రతి వ్యూహాలపై పార్టీలు, అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు సుమన్ ఓటర్లను అభ్యర్థించారు. యూసుఫ్‌గూడలో ఆదివారం నవీన్‌యాదవ్ తరపున ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ అసెంబ్లీ, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ రోజుల్లో అర్హులైన అందరు ఓటర్లకు పెయిడ్ హాలిడే ప్రకటించారు. సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, జరిమానా. .