Jubilee Hills By Election: ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్లు వేశారంటే?
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:03 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున నవీన్ యాదవ్, మాగంటి సునీత నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ కు ఇప్పటి వరకు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు(Jubilee Hills By Election) సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తరఫున నవీన్ యాదవ్, మాగంటి సునీత నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ కు ఇప్పటి వరకు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్(BRS) నుంచి పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య హరిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 21 తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. అక్టోబర్ 19 ఆదివారం, ఆక్టోబర్ 20 దీపావళి(Diwali) కావడంతో నామినేషన్లు వేసేందుకు అవకాశం లేదు. దీంతో అక్టోబర్ 21న (మంగళవారం) నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను(Jubilee Hills By Election) ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా తాము గెలవాలని అన్నీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే వాడ వాడల్లో తిరుగు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపు తమదంటే తమదని అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. తమ పాలనే కాంగ్రెస్ ను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలానే ప్రభుత్వ వ్యతిరేకత తమ అభ్యర్థిని గెలిపిస్తుందని బీఆర్ఎస్(BRS) ఉంటుంది. జూబ్లీహిల్స్ ప్రజల తమకే ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని బీజేపీ చెబుతుంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ 2023లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల అనారోగ్య కారణంతో ఆయన మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఈ ఎన్నికలను ఈసీ నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి:
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ