Bihar Election 2025: పోలింగ్ రోజున ఉద్యోగులు, కార్మికులకు పెయిడ్ హాలిడే
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:15 PM
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ అసెంబ్లీ, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ రోజుల్లో అర్హులైన అందరు ఓటర్లకు పెయిడ్ హాలిడే ప్రకటించారు. సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, జరిమానా. .
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 6, 2025 (గురువారం) మొదటి దశ, నవంబర్ 11, 2025 (మంగళవారం) రెండో దశ పోలింగ్ రోజుల్లో అర్హులైన అందరు ఓటర్లకు పెయిడ్ హాలిడే ప్రకటించారు. ఇది 1951 రిప్రెజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్‌లోని సెక్షన్ 135బీ ప్రకారం అమలు చేస్తారు. ఈ నియమం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పాల్గొనే ఓటర్లకు కూడా వర్తిస్తుంది.
ఎవరికి ఈ సౌలభ్యం ఉంటుంది.. అనే విషయానికొస్తే, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ వెసులుబాటు ఉంటుంది. వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఇతర సంస్థల్లో పనిచేసే అర్హులైన ఓటర్లకు ఆయా రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెయిడ్ లీవ్ లభిస్తుంది.
డైలీ వేజ్, క్యాజువల్ వర్కర్లకు కూడా శాలరీ కటింగ్ లేకుండా చూస్తారు. ఎవరైనా సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, వారికి జరిమానా విధించబడుతుంది. తమ నియోజకవర్గంలోనే కాకుండా, ఇతర ప్రాంతాల్లో పనిచేసే (ఉదా: ఇండస్ట్రియల్ లేదా వ్యాపార సంస్థల్లో) ఓటు హక్కు ఉన్నవారికి కూడా ఈ హాలిడే వర్తిస్తుంది. ఇది.. ఆయా ఓటర్లకు ఆర్థిక నష్టం కలుగకుండా, తమ సొంత ఊళ్లకి వెళ్లి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తుంది.
ఇవి కూడా చదవండి..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ
Read Latest Telangana News And Telugu News