Share News

Telangana: తెలంగాణ ఆవిర్భావంలో ప్రొ. కోదండరామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేది: టీపీసీసీ చీఫ్

ABN , Publish Date - Oct 22 , 2025 | 03:01 PM

తెలంగాణ ఆవిర్భావంలో ప్రొ. కోదండ రామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరడమైందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

Telangana: తెలంగాణ ఆవిర్భావంలో ప్రొ. కోదండరామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేది: టీపీసీసీ చీఫ్
Mahesh Kumar Goud, Kodandaram

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కోదండ రామ్ నిస్వార్థంగా, నిజాయితీగా కృషి చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో కోదండ రామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని ఆయన చెప్పారు. ఇవాళ (బుధవారం) తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ కోదండరామ్ ని మహేష్ కుమార్ గౌడ్ కలిశారు.

'పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు తెలుసు. పదేళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలన విముక్తి కోసం 2023లో మేమంతా కలిసి పోరాడాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారి సహకారం మరచిపోం. ఉద్యోగ నియామక రూపకల్పనలో కోదండ రామ్ సలహాలు, సూచనలు విలువైనవి. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతోంది' అని మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.


హైదరాబాద్‌లో తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపకులు ప్రొ. కోదండరామ్ ను కలిసి.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరడమైందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. యువకుడైన నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు. సీపీఐ, సీపీఏం, ఏంఐఎం పార్టీల మాదిరి టీజేఏసీ మద్దతు కూడా కోరామని ఆయన చెప్పారు.

కేంద్రమంత్రి స్థాయిలో ఉండి బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? అని మహేష్ విమర్శించారు. కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి నోటికొచ్చింది మాట్లాడటం విచారకరమని ధ్వజమెత్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలనేదే బీజేపీ నేతల పన్నాగమని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మిత్ర పక్షాల విషయంలో, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు.


ఇవి కూడా చదవండి..

అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 05:06 PM