Home » Jharkhand
జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈడీ అరెస్టుతో బిర్సా ముండా జైలులో ఉన్న హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. జేఎంఎం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయి సోరెన్ ఈనెల 5న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగే ఓటింగ్‌కు హాజరయ్యేందుకు హేమంత్ సోరెన్‌ను రాంచీ ప్రత్యేక కోర్టు అనుమతించింది.
జార్ఖండ్‌లోని జేఎంఎం(JMM) నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించడం.. జేఎంఎం, కాంగ్రెస్(Congress) నేతల మధ్య అంతర్గత విభేదాలను కప్పిపుచ్చే రాజకీయ ఎత్తుగడగా జార్ఖండ్ బీజేపీ అభివర్ణించింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందన్న ఆరోపణను ఆ పార్టీ తిప్పికొట్టింది.
జార్ఖాండ్‌లో చేటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఆసక్తికరంగా, మోదీ క్రెడిట్ వల్లే చంపయి సోరెన్ ముఖ్యమంత్రి అయినట్టు బీజేపీ అభివర్ణించింది. దేశంలో ఆనువంశిక రాజకీయాలకు వ్యతిరేకమైన వాతావరణం ఉండటం వల్లే చంపయి సోరెన్ సీఎం అయినట్టు తెలిపింది.
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు 5 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించారు. హేమంత్ సోరెన్‌ను ఏడు గంటల సేపు విచారణ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డేరెక్టరేట్ గత బుధవారం రాత్రి అరెస్టు చేసి రాంచీలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు.
జార్ఖండ్(Jharkhand) ప్రభుత్వంలో ఏర్పడిన సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపయి సోరెన్(Champai Soren) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
జార్ఖండ్(Jharkhand) సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) రాజీనామా, అరెస్ట్ తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం(JMM), కాంగ్రెస్(Congress) పార్టీలు తలమునకలయ్యాయి.
రెండ్రోజులుగా జార్ఖాండ్ ప్రభుత్వంలో తలెత్తిన ప్రతిష్ఠంభన కొలిక్కి వస్తోంది. జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేత చంపై సోరెన్ గురువారం మధ్యాహ్నం 5 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను సీపీ రాధాకృష్ణన్‌ను కలుసుకున్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖను గవర్నర్‌కు ఆయన అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు.
జార్ఖండ్‌లో గడిచిన కొన్ని గంటలుగా ప్రభుత్వం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని జార్ఖండ్ ముక్తీ మోర్చా సీనియర్ నేత చంపై సోరెన్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరుతూ ఆయన లేఖ రాశారు.
భూకుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు రాంచీలోని పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనను ఒక రోజు కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్‌ఏ కోర్టు నిర్ణయం తీసుకుంది.