Share News

Hemant soren: మాజీ సీఎం రిమాండ్ మరో 3 రోజులు పొడిగింపు

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:23 PM

భూకుంభకోణం కేసులో మనీలాండరింగ్ కింద అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించారు. రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు సోమవారంనాడు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Hemant soren: మాజీ సీఎం రిమాండ్ మరో 3 రోజులు పొడిగింపు

రాంచీ: భూకుంభకోణం కేసులో మనీలాండరింగ్ కింద అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించారు. రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు సోమవారంనాడు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈనెల 7వ తేదీన ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ప్రత్యేక కోర్టు ఆదేశించింది. సోమవారంతో రిమాండ్ గడువు తీరనుండటంతో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. సోరెన్‌ను మరో నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా, మూడు రోజుల కస్టడీకి ప్రత్యేక కోర్టు అంగీకరించింది.


కాగా, ఈడీ అరెస్టును సవాలు చేస్తూ సోరెన్ వేసిన పిటిషన్‌పై విచారణను జార్ఖాండ్ హైకోర్టు ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించాలని ఈడీని ఆదేశించింది.

Updated Date - Feb 12 , 2024 | 05:23 PM