Share News

Bharat Jodo Nyay Yatra: బొగ్గు రవాణా కార్మికులతో ముఖాముఖి... సైకిల్ నడిపిన రాహుల్

ABN , Publish Date - Feb 05 , 2024 | 03:21 PM

జార్ఖాండ్‌లో కాంగ్రెస్ ''భారత్ జోడో న్యాయ్ యాత్ర'' కొనసాగుతోంది. యాత్రకు సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన బొగ్గు రవాణా కార్మికులతో కలిసి ముచ్చటించారు. వారితో అడుగులో అడుగు వేశారు. సైకిళ్లపై టన్నుల బరువును మోసుకెళ్తున్న కార్మికుల కష్టాన్ని తెలుసుకునేందుకు సైకిల్ నడిపారు.

Bharat Jodo Nyay Yatra: బొగ్గు రవాణా కార్మికులతో ముఖాముఖి... సైకిల్ నడిపిన రాహుల్

రాంచీ: జార్ఖాండ్‌లో కాంగ్రెస్ ''భారత్ జోడో న్యాయ్ యాత్ర'' (Bharat Jodo Nyay Yatra) కొనసాగుతోంది. యాత్రకు సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన బొగ్గు రవాణా కార్మికులతో (Coal workers) కలిసి ముచ్చటించారు. వారితో అడుగులో అడుగు వేశారు. సైకిళ్లపై టన్నుల బరువును మోసుకెళ్తున్న కార్మికుల కష్టాన్ని తెలుసుకునేందుకు సైకిల్ (bicycle) నడిపారు. ట్విటర్ ఖాతాలో రాహుల్ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.


''ప్రతిరోజూ 200 కిలోల బరువున్న బొగ్గు మూటలతో 30 నుంచి 40 మీటర్లు ప్రయాణం సాగించే కార్మికుల ఆదాయం చాలా స్వల్పం. వారితో కలిసి నడవకుండా, వారి బరువు బాధ్యతలను పంచుకోకుండా వారి సమస్యలను అవగాహన చేసుకోలేం'' అని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం జార్ఖాండ్‌లో రామ్‌గఢ్‌లో రాహుల్ భారత్ జోడో యాత్ర జరుగుతోంది. సోమవారం తన పర్యటనలో భాగంగా 1857 జార్ఖాండ్ రివల్యూషన్‌లో అమరులైన షేక్ భిఖారి, తికాయిత్ ఉమ్రావ్ సింగ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

Updated Date - Feb 05 , 2024 | 04:21 PM