Share News

ED: బయటపడ్డ 539 పేజీల వాట్సప్ చాట్.. సోరెన్‌కు బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Feb 08 , 2024 | 01:24 PM

భూకుంభ కోణం(Land Scam) కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌(Hemanth Sorean)కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈడీ(ED) అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు.

ED: బయటపడ్డ 539 పేజీల వాట్సప్ చాట్.. సోరెన్‌కు బిగుస్తున్న ఉచ్చు

రాంచీ: భూకుంభ కోణం(Land Scam) కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌(Hemanth Sorean)కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈడీ(ED) అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు. 539 పేజీలతో ఉన్న ఈ చాట్‌లో మరికొన్ని అక్రమాలు వెలుగు చూశాయి.

ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోరెన్ తన సన్నిహితులతో కలిసి ప్రభుత్వ భూములను లాక్కోవడమే కాకుండా లంచాలు తీసుకుంటూ అధికారులను వారు కోరిన చోటకి బదిలీ చేసినట్లు తేలింది. రికవరీ చేసిన వాట్సప్ చాట్‌లో ఈ విషయం వెల్లడైంది. సోరెన మిత్రుడు బినోద్ సింగ్ వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్. వారిరువురి మధ్య జరిగిన వాట్సప్ మెసేజ్‌లో రూ.కోట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నడిచాయి.


ఈ వాట్సప్ చాట్‌ను ఈడీ అధికారులు కోర్టులో సమర్పించారు. ఈ కీలక చాట్‌లో అధికారుల పేర్లు, వారికి ఎక్కడ పోస్టింగ్ కోరుకుంటున్నారో తెలుసుకుని.. అందుకు తగినట్లు లంచం డిమాండ్ చేసి పనులు జరుపుకున్నట్లు తేలింది. నకిలీ పత్రాలు సృష్టించి, ప్రభుత్వ ధ్రువపత్రాలను తారుమారు చేసి సోరెన్ ప్రభుత్వం భూముల్ని అక్రమంగా సంపాదించిందని ఈడీ వివరించింది.

అంతటితో ఆగకుండా అధికారులను బదిలీ చేయడానికి లంచాలు తీసుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడారని ఈడీ ఆరోపించింది. ఇదిలా ఉండగా, రాంచీ పీఎంఎల్‌ఏ కోర్టు సోరెన్‌కు ఈడీ రిమాండ్‌ను మరో 5 రోజులు పొడిగించింది. జార్ఖండ్‌లో భూకుంభకోణం విచారణలో భాగంగా సోరెన్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్దీ మరిన్ని అక్రమాలు బయటపడుతుండటంతో సోరెన్‌కు ఉచ్చు బిగుస్తున్నట్లేనని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2024 | 03:01 PM