Share News

Kalpana Soren: స్టేజిపై కంటతడి పెట్టిన మాజీ సీఎం భార్య

ABN , Publish Date - Mar 04 , 2024 | 07:25 PM

రాంచీ: మనీ లాండరింగ్ కేసులో జైలుపాలైన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemant Soren)ను తలుచుకుని ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు. రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

Kalpana Soren: స్టేజిపై కంటతడి పెట్టిన మాజీ సీఎం భార్య

రాంచీ: మనీ లాండరింగ్ కేసులో జైలుపాలైన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemant Soren)ను తలుచుకుని ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు. రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు ఆపుకోలేకపోయారు.


"బరువెక్కిన హృదయంతో నేను ఈరోజు మీ ముందున్నాను. మా మామగారు (శిబు సోరెన్), మా అత్తగారు అయితే తమ కుమారుడిని తలుచుకుని ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. నా కన్నీటిని అదుపు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నాను...మీరే నా బలం'' అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కల్పనా సోరెన్ అన్నారు.


ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన కల్పన

గిర్డిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు కల్పనా సోరెన్ ఆదివారంనాడు ప్రకటించారు. జార్ఖాండ్ గ్రౌండ్స్‌లో జేఎంఎం 51వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 'అక్రోష్ దివస్'గా నిర్వహించారు. ''ఈ రోజు నా పుట్టినరోజు. అత్తమామల ఆశీస్సులు తీసుకున్నాను, నా భర్తను కూడా ఉదయం కలుసున్నాను'' అని కల్పనా సోరెన్ సోమవారం ఒక ట్వీట్‌లో తెలిపారు. అనంతరం జేఎంఎం 'ఫౌండేషన్‌ డే'లో ఆమె పాల్గొన్నారు. జార్ఖాండ్ ప్రజల అభీష్టం మేరకే తాను ప్రజాజీవితంలోకి అడుగుపెట్టానని, హేమంత్ సోరెన్ తిరిగి వచ్చేంత వరకూ ఆయన ఆలోచనలు, ప్రజాసేవను తాను కొనసాగిస్తానని చెప్పారు. జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయిన హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Updated Date - Mar 04 , 2024 | 07:25 PM