Home » Iran War
హోర్ముజ్ జలమార్గం మూతపడడంతో ఇరాన్ తీవ్రంగా ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీంతో హోర్ముజ్‌ను మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. ట్రంప్ వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు.
హోర్ముజ్‌ను తెరిచే దిశగా ఇరాన్ చేసిన ప్రతిపాదనలను తాము తిరస్కరించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ విషయంపై ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందించింది.
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన మ్యాప్‌ను షేర్ చేశారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి పేరును మార్చి దానికి 'ట్రంప్ జలసంధి' అని పేరు పెట్టారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏడు రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రతిపాదన చేసింది.
అమెరికా మళ్లీ దాడికి దిగితే, ఈ ఘర్షణ కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా హిందూ మహాసముద్రం, ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుందని ఇరాన్ హెచ్చరించింది.
అమెరికా విధించిన కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. తమ విమానాలను నిలిపివేసేందుకు అమెరికాతో కలిసి పనిచేసే పొరుగు దేశాల విమానాశ్రయాలు కూడా పనిచేయకుండా చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
హోర్ముజ్‌లో మరో నౌకపై దాడి జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలో ఎమ్‌వీ కేప్ డావ్ అనే నౌకపై టార్పిడోలతో దాడి జరగడంతో ఓ భారతీయ నావికుడు మృతి చెందారు.
తమది ఉగ్రవాద దేశమంటూ నిందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు
హోర్ముజ్ జలసంధిలో తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలపై కొరడా ఝులిపించింది ఇరాన్. సరుకును జప్తు చేయడంతో పాటు, వాటిని తాత్కాలికంగా అదుపులోకి తీసుకునే ప్రతిపాదిత బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
హమాస్ ఆర్థిక విభాగాధిపతి హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో తమ దళాలు జరిపిన దాడిలో మహమ్మద్ అబు అల్వాన్ చనిపోయాడని వెల్లడించింది.