Share News

యూకే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన ఇరాన్

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:21 PM

ఇరాన్ తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. యూకే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించింది.

యూకే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన ఇరాన్
Iran UK tensions

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. యూకే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించింది. యూకే నిఘా సంస్థ ఎంఐ6తో కూడా ఇరాన్‌కు ముప్పు ఉందని పేర్కొంది. యూకే ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఫెయిర్‌ఫోర్డ్ స్థావరం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ చిక్కిన వ్యక్తులపై ఇటీవల. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు ఇరాన్ నిఘా కార్యకలాపాలకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యూకే దళాలను ఉగ్రవాద సంస్థలుగా ఇరాన్ ప్రకటించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


గతేడాది కాలంలో బ్రిటన్ తమకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని ఇరాన్ ఈ సందర్భంగా ఆరోపించింది. బ్రిటన్ భూభాగాల మీదుగా ఇరాన్‌పై యూఎస్ దాడులకు అనుమతినిచ్చారని ఆరోపించింది. ప్రత్యేక సైనికదళం ఐఆర్‌జీసీని యూకే జాతీయ భద్రతా ముప్పుగా పేర్కొనడంపై కూడా ఇరాన్ అభ్యంతరం చెప్పింది.


ఇరాన్‌పై దాడులకు ఆర్ఏఎఫ్‌కు చెందిన ఫెయిర్‌ఫోర్డ్ స్థావరాన్ని యూఎస్ వినియోగించుకున్న విషయం తెలిసిందే. అయితే, సెప్టెంబర్ 27న ఆ స్థావరం వద్ద కొందరు అనుమానాస్పదంగా సంచరించడం కలకలానికి దారితీసింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక ఇరాన్ హస్తం ఉందన్న ఆరోణలు వెల్లువెత్తాయి. అయితే, యూకేలోని ఇరాన్ రాయబారి మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్‌‌లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్

జపాన్‌ను కుదిపేసిన భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత

Updated Date - Nov 01 , 2026 | 04:24 PM