Home » Indigo
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన 70 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో 74 ఇండిగో విమానాలను ఎయిర్ లైన్స్ అధికారులు రద్దు చేశారు.
ఇండిగో సంక్షోభంతో డొమస్టిక్ విమాన సర్వీసుల టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ముంబై నుంచి కొచ్చి వెళ్లడానికి ఏకంగా 40 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విమానయాన శాఖ విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
ఇండిగో మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ ఉన్నత స్థాయి సమీక్షకు ఆదేశించింది. కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పదవి నుంచి తొలగించాలని విమానయాన శాఖ కోరినట్లు తెలుస్తోంది.
ఇండిగో విమానం రద్దుతో విసిగిపోయిన ఓ ఆఫ్రికా మహిళ సంస్థ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇండిగో సంక్షోభం కారణంగా కొన్ని వేల మంది విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు అవుతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇండిగో ఆపరేషనల్ సిస్టంను రీబూటింగ్ చేసిన కారణంగా విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం తలెత్తిందనీ, రద్దయిన విమానాల పాసింజర్లు ఎయిర్‌పోర్టులకు రావద్దని, మరిన్ని ఇబ్బందులకు గురికావద్దని పీటర్ ఎల్బర్స్ కోరారు.
ఇండిగో విమాన సర్వీసుల సామూహిక రద్దుతో తలెత్తిన సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.
పైలట్ల కొరతతో ఇండిగో సంస్థ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగోను ఆదుకోవటానికి ముందుకు వచ్చింది.
దేశ వ్యాప్తంగా శుక్రవారం సుమారు 400 విమాన సర్వీసులను.. ఇండిగో రద్దు చేసింది. దీంతో ప్రయాణికులంతా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇదిలావుంటే.. చాలా మంది తమ పనులు ఆగిపోయి అవస్థలు పడుతున్నారు. మరికొందరేమో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రయాణికులు కోపం కట్టలు తెంచుకుంటోంది..
దేశ వ్యాప్తంగా ఇండిగో సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతోంది. మరో 400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అర్థరాత్రి వరకు ఇండిగో సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.