Share News

IndiGo CEO: 1000 ఇండిగో విమానాల రద్దు.. 15వ తేదీకి సర్వీసుల పునరుద్ధరణ

ABN , Publish Date - Dec 05 , 2025 | 08:30 PM

ఇండిగో ఆపరేషనల్ సిస్టంను రీబూటింగ్ చేసిన కారణంగా విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం తలెత్తిందనీ, రద్దయిన విమానాల పాసింజర్లు ఎయిర్‌పోర్టులకు రావద్దని, మరిన్ని ఇబ్బందులకు గురికావద్దని పీటర్ ఎల్బర్స్ కోరారు.

IndiGo CEO: 1000 ఇండిగో విమానాల రద్దు.. 15వ తేదీకి సర్వీసుల పునరుద్ధరణ
IndiGo CEO Pieter Elbers

న్యూఢిల్లీ: ఇండిగో (IndiGo) విమాన సర్వీసులకు గత మూడు రోజులుగా తీవ్ర అంతరాయం తలెత్తడం, శుక్రవారంనాడు 1000కు పైగా విమానాలు రద్దు కావడంపై ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ (Pieter Elbers) బహిరంగ క్షమాపణ చెప్పారు. శనివారంనాడు కూడా ఇదే సమస్య ఉంటుందని, వెయ్యి కంటే తక్కువగా విమానాలు రద్దు కావచ్చని చెప్పారు. డిసెంబర్ 10-15వ తేదీల్లోపు పూర్తి స్థాయిలో సర్వీసుల పునరుద్ధరణ జరగవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.


ఇండిగో ఆపరేషనల్ సిస్టంను రీబూటింగ్ చేసిన కారణంగా విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం తలెత్తిందనీ, రద్దయిన విమానాల పాసింజర్లు ఎయిర్‌పోర్టులకు రావద్దని, మరిన్ని ఇబ్బందులకు గురికావద్దని కోరారు. గత కొద్ది రోజులుగా ఎయిర్‌లైన్స్‌లో నిర్వహణాపరమైన అవాంతరాలు తలెత్తాయని, అప్పట్నించి సమస్య తీవ్రమైందని, ఈరోజు (డిసెంబర్ 5)మరింత తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయని శుక్రవారంనాడు ఒక వీడియో సందేశంలో ఎల్బర్స్ తెలిపారు.


5 నుంచి 10 రోజుల్లో

ఐదు నుంచి పది రోజుల్లో పూర్తిస్థాయి ఆపరేషనల్‌ రికవరీ జరగవచ్చని అంచనా వేస్తున్నామని ఎల్బర్స్ చెప్పారు. క్రమంగా డిసెంబర్ 10 నుంచి 15వ తేదీలోపు సర్వీసులు యథాపూర్వ పరిస్థితికి వస్తాయన్నారు. ప్రయాణికులు ఎప్పటికిప్పుడు ఫ్లైట్ అప్డేట్స్‌ను తెలుసుకోవాలని సూచించారు.


విమాన సర్వీసుల్లో జాప్యం, రద్దు కారణంగా కస్టమర్లు కలిగిన అసౌకర్యంపై తాము క్షమాపణ తెలియజేస్తున్నామని, మూడు విధాలుగా కార్యాచరణ చేపట్టామని చెప్పారు. కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా మెసేజ్‌లు పంపడం, సోషల్ మీడియాలో మరింత సమగ్ర సమచారం ఇవ్వడం, రిఫండ్‌ ఇవ్వడం, కాన్సలేషన్‌తో సహా కస్టమర్ సపోర్ట్ చర్చలు తీసుకోవడం ఇందులో భాగమని చెప్పారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నందున శనివారంనాడు వెయ్యికంటే తక్కువ విమానాలే రద్దు కావచ్చని అన్నారు. నిర్దిష్ట ఎఫ్‌డీటీఎల్ ఇంప్లిమెంటేషన్ రిలీఫ్ గ్రాంటింగ్‌ విషయంలో డీజీసీఏ సపోర్ట్ చాలా సహాయకారిగా ఉందని ఆయన చెప్పారు. పౌరవిమానాయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ సమన్వయంతో రాబోయే రోజుల్లో ఇండిగో మరింత మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్, ఖర్గేను కాదని.. పుతిన్‌తో విందుకు థరూర్‌కు ఆహ్వానం

ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం నిర్ణయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 08:32 PM