Home » India vs Pakistan
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్-2025 చివరి రోజు రానే వచ్చింది. ఈరోజు దుబాయ్ వేదికగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. భారత్- పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. సాధారణంగా క్రికెట్ అంటేనే పిచ్చెక్కే అభిమానులు.. భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది.. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు గ్రౌండ్ లోకి దిగాయి. ఈ మ్యాచ్‌కి సంబంధించిన బాల్ టు బాల్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..
ప్రస్తుత ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ల్లో ఆట కంటే మైదానంలో జరిగిన డ్రామానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తొలి మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం ఉద్రిక్తతలు సృష్టించింది.
ఆసియా కప్‌లో వరుసగా రెండు సార్లు టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జట్టు అభిమానులు, మాజీ ఆటగాళ్లు కోపంతో మండిపోతున్నారు. పాక్ ఓటములపై పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించారు.
ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. ఈ విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 74 పరుగులు చేసి పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు.
ఆసియా కప్-2025లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు పలు వివాదాలకు కారణమవుతున్నాయి. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాక్ ఆటగాళ్లు, ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
హాఫ్ సెంచరీ చేసి పాకిస్థాన్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించిన ఫర్హాన్ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. ఈ నేపథ్యంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌పై పాకిస్థాన్ జట్టు మాజీ బౌలర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు.
పాకిస్థాన్ టెర్రరిస్టులు పహల్గామ్‌లో దాడి చేసి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ఫర్హాన్ అలా తుపాకీ పేలుస్తున్నట్టు చేసిన సెలెబ్రేషన్‌పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ఈ సంబరాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసియా కప్ గ్రూప్-4 దశలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మరోసారి భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ వరుసగా రెండో సారి టీమిండియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమి నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో నేడు టీమిండియా దుబాయ్ వేదికగా సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
మరికాసేపట్లో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో నేడు టీమిండియా దుబాయ్ వేదికగా సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ లెవెన్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.