Salman Ali Agha Cheque: పాకిస్థాన్ కెప్టెన్ తీరు చూడండి.. రన్నరప్ చెక్కును ఎలా విసిరాడంటే..
ABN , Publish Date - Sep 29 , 2025 | 10:03 AM
ఆసియా కప్‌లో వరుసగా మూడు సార్లు టీమిండియా చేతిలో ఓడిపోవడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు జరిగిన రెండు మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసింది.
ఆసియా కప్‌లో వరుసగా మూడు సార్లు టీమిండియా చేతిలో ఓడిపోవడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు జరిగిన రెండు మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసింది (Asia Cup final). మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. అయితే చివరి వరకు పోరాడి ఓడిపోవడంతో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Ali Agha) తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన నిరాశను మైదానంలోనే చూపించాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రతినిధి అమీనుల్ ఇస్లాం రన్నరప్ చెక్కును సల్మాన్ అఘాకు అందజేశారు. రన్నరప్ చెక్కును అందుకున్న సల్మాన్ వెంటనే దానిని పక్కకు విసిరేశాడు (runners-up cheque). అతడి తీరుతో వేదిక మీద ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. అలాగే మైదానంలోని ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ అతడి చర్యపై నిరసన వ్యక్తం చేశారు. మైదానంలోని ప్రేక్షకుల వైపు చూసి నవ్వుతూ సల్మాన్ వెళ్లిపోయాడు (post-match drama).
ఫైనల్ మ్యాచ్ ఓటమి గురించి మాట్లాడిన సల్మాన్.. ఫలితం తమకు నిరాశకు గురి చేసిందన్నాడు (viral cricket video). బ్యాటింగ్‌లో చేసిన పొరపాట్ల వల్లే మ్యాచ్‌లో ఓడిపోయినట్టు చెప్పాడు. కానీ, తమ బౌలింగ్ అద్బుతంగా ఉందని, బ్యాటర్లు తగినన్ని పరుగులు అందించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చెప్పాడు. భవిష్యత్తులో తమ బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకుంటామని, బలంగా తిరిగి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి