Mohsin Naqvi Post: పీసీబీ చీఫ్ నఖ్వీ వివాదాస్పద పోస్ట్.. టీమిండియా అందుకే ట్రోఫీ తీసుకోలేదా..
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:09 PM
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ అంతర్గత మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ట్రోఫీని అందజేస్తానని పట్టుబట్టడంతో, వేడుక గంటకు పైగా ఆలస్యమై ట్రోఫీ ప్రదానం లేకుండానే ముగిసింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆ దేశ అంతర్గత మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ట్రోఫీని అందజేస్తానని పట్టుబట్టడంతో, వేడుక గంటకు పైగా ఆలస్యమై ట్రోఫీ ప్రదానం లేకుండానే ముగిసింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూని నుంచి ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నఖ్వీ మాత్రం అంగీకరించలేదు. తనతో పాటు ట్రోఫీని తీసుకెళ్లిపోయారు (Asia Cup controversy).
నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది (India cricketers trophy refusal). నఖ్వీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ టీమిండియా నిర్ణయానికి ప్రధాన కారణం. ఆదివారం చేసిన ట్వీట్‌లో నఖ్వీ.. 'ఫైనల్ డే' అని పేర్కొన్నారు. ఆ ఫొటోలో కెప్టెన్ సల్మాన్ ఆఘా, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదితో సహా పాకిస్థాన్ క్రికెటర్లు వైమానిక యుద్ధ విమానాల ఫొటోలతో కూడిన ఫ్లైట్ సూట్‌లను ధరించి ఉన్నారు. ఇక, ఈ టోర్నీ ప్రారంభంలో నఖ్వీ.. క్రిస్టియానా రొనాల్డో ఫొటోను పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలో రొనాల్డో విమానం కూలిపోతున్నట్టు చేతులతో సంజ్ఞలు చేస్తున్నాడు (provocative social media posts). ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రొనాల్డ్ చేసుకున్న ఆ సెలబ్రేషన్‌ను నఖ్వీ భారత్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు (BCCI vs PCB). ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన నఖ్వీ ప్రత్యర్థి జట్టుకు చెందిన దేశం గురించి ఇలా చెడు ప్రచారాలు చేయడం చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది. టీమిండియా సరైన నిర్ణయమే తీసుకుందని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి