Share News

Asia Cup trophy: పీసీబీ చీఫ్‌కు కష్టాలు తప్పవా.. ట్రోఫీ ఇచ్చేందుకు నఖ్వీ కండిషన్ ఏంటంటే..

ABN , Publish Date - Oct 01 , 2025 | 07:37 AM

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు ట్రోఫీ దక్కకూడదని నఖ్వీ దానిని తనతో పాటు తీసుకుపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Asia Cup trophy: పీసీబీ చీఫ్‌కు కష్టాలు తప్పవా.. ట్రోఫీ ఇచ్చేందుకు నఖ్వీ కండిషన్ ఏంటంటే..
Mohsin Naqvi

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు ట్రోఫీ దక్కకూడదని నఖ్వీ దానిని తనతో పాటు తీసుకుపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం దుబాయ్‌‌లో జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి టీమ్ ఇండియా ఆసియా కప్‌ను గెలుచుకుంది (Asia Cup trophy).


పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది. పాకిస్థాన్ అంతర్గత మంత్రి, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయిన నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోకూడదని భారత జట్టు భావించింది. దీంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని, మెడల్స్‌ను తనతో పాటు హోటల్‌కు తీసుకెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ ట్రోఫీలు, మెడల్స్ నఖ్వీ బస చేస్తున్న హోటల్‌లోనే ఉన్నాయి. నఖ్వీ తీరుపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అలా ట్రోఫీని ప్రైవేట్ ప్లేస్‌కు తీసుకెళ్లే అధికారం నఖ్వీకి లేదని స్పష్టం చేసింది (India vs Pakistan cricket).


నవంబర్‌లో దుబాయ్‌లో జరిగే ఆసియా ఏసీసీ సమావేశంలో నఖ్వీని ఏసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని బీసీసీఐ పావులు కదుపుతోంది (PCB vs BCCI). కాగా, భారత జట్టుకు ట్రోఫీ ఇచ్చేందుకు నఖ్వీ సిద్ధంగానే ఉన్నారట. అయితే నిర్వాహకులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే, ఆ ట్రోఫీని తన చేతుల మీదుగానే భారత జట్టుకు అందజేస్తానని నఖ్వీ కండిషన్ పెట్టారట. ఈ కండిషన్‌కు బీసీసీఐ అంగీకరించలేదని సమాచారం.


ఇవి కూడా చదవండి

ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..

బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 01 , 2025 | 09:21 AM