Share News

India vs Pakistan: భారత్‌కు ట్రోఫీ ఎలా దక్కుతుంది.. వాళ్లు క్రికెట్‌ను అవమానించారు: పాక్ కెప్టెన్

ABN , Publish Date - Sep 30 , 2025 | 07:19 AM

ఆసియా కప్-2025 టోర్నీ ఆట కంటే ఇతర విషయాలతోనే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆటను వెనక్కి నెట్టేశాయి. మ్యాచ్ అనంతరం మైదానంలో చోటుచేసుకున్న వివాదాలే హైలైట్ అవుతున్నాయి.

India vs Pakistan: భారత్‌కు ట్రోఫీ ఎలా దక్కుతుంది.. వాళ్లు క్రికెట్‌ను అవమానించారు: పాక్ కెప్టెన్
Salman Agha

ఆసియా కప్-2025 టోర్నీ ఆట కంటే ఇతర విషయాలతోనే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆటను వెనక్కి నెట్టేశాయి (India vs Pakistan). మ్యాచ్ అనంతరం మైదానంలో చోటుచేసుకున్న వివాదాలే హైలైట్ అవుతున్నాయి. ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆ వివాదాలు మరింత ముదిరాయి. ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చీఫ్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని వెళ్లిపోయారు (India trophy refusal).


ఈ మొత్తం పరిణామాలపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Agha) స్పందించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన సల్మాన్.. టీమిండియా తీరుపై విమర్శలు గుప్పించాడు. 'ఆసియా కప్‌లో భారత్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. మాతో కరచాలనం చేయకపోవడం నిరాశ కలిగించింది. వాళ్లు క్రికెట్‌నే అవమానపరిచారు. మెరుగైన జట్లు ఇలా చేయవు. టోర్నీ ఆరంభానికి ముందు విలేకరుల సమావేశంలో సూర్య (Suryakumar Yadav) నాతో కరచాలనం చేశాడు. ఆ తర్వాత అతడికి ఎవరి నుంచో ఆదేశాలు వచ్చాయి' అని సల్మాన్ పేర్కొన్నాడు.


'పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే టీమిండియా ఆటగాళ్లు మాతో కరచాలనం చేయలేదు. ఆసియా కప్ విజేతలకు ఏసీసీ అధ్యక్షుడు ట్రోఫీ బహూకరించడం అనేది ఆనవాయితీ (ACC trophy snub). అతడి నుంచి ట్రోఫీ అందుకోకపోతే మీకు అదెలా వస్తుంది' అని సల్మాన్ ప్రశ్నించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రన్నరప్ చెక్‌ను సల్మాన్ విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..

బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 07:19 AM