Home » Independence Day
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పౌరులను ఉద్దేశిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ 79వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసుకోవడానికి, వికసిత్ భారత్‌ను నిర్మించడం కోసం మనల్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించుగాక.
79th Independence Day Celebrations: స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
పంద్రాగష్టు వేడుకలకు దేశవ్యాప్తంగా భద్రతను గణనీయంగా పెంచారు. పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయడం, వాహనాలు, వ్యక్తుల కదలికల్ని చెక్‌పోస్టులు, మెరుగైన ఏఐ నిఘాతో డేగకన్ను వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భారత స్వాతంత్ర్య సమరాన్ని నిరాయుధ, శాంతియుత పద్ధతిలో మహాత్మాగాంధీ నడిపారని కేసీఆర్ కొనియాడారు. అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర్య పోరాట కార్యాచరణ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఇమిడి ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, అన్ని సంస్థలు, పాఠశాలలు, కళాశాలలలో జెండాను కచ్చితంగా ఎగురవేస్తారు. అయితే, జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. జాతికి గౌరవంగా భావించే జెండాను ఎగురవేసేటప్పుడు ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చూపు తిప్పుకోనివ్వని చారిత్రాత్మక కట్టడాలు, నోరూరించే ఆహారాలతో హైదరాబాద్ నగరం ప్రపంచ పర్యాటక ప్రియులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే, దశాబ్దాల చరిత్రకు తార్కాణంగా నిలిచే ఫేమస్ ఫుడ్ స్పాట్స్ కొన్ని ఇప్పటికీ ఆహార ప్రియులను ఊరిస్తూనే ఉన్నాయంటే నమ్ముతారా.. స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉన్న..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరం ముస్తాబవుతోంది. ఈ మేరకు పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించామని తెలిపారు.
దేశ విభజన భారత చరిత్రలో విషాదకరమైన అధ్యాయం అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ 'పార్టీషన్ హర్రర్స్ రిమంబరెన్స్ డే' నాడు ఆయన.. పాకిస్థాన్ విడిపోయిన సందర్భంలో జరిగిన మారణహోమాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.